డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్ భ‌ర్త అరెస్ట్

Update: 2023-01-02 11:20 GMT
హైద‌రాబాద్  లో డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ  క‌ల‌క‌లం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టికే ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్ ఎడ్విన్  కేసులో ఇద్ద‌రు అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌ముఖ డీజే మైరాన్ మోహిత్ కూడా అరెస్ట్  అయ్యాడు.  టాలీవుడ్..బాలీవుడ్ లో హీరోయిన్ గా కొన‌సాగుతోన్న నేహా దేశ్ పాండే భ‌ర్త మైరాన్. పోలీసుల విచార‌ణ‌లో మైరాన్ నుంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

దాదాపు 200 పైగా డీజేల‌ను గుప్టిట్లో పెట్టుకుని నిర్వ‌హిస్తున్నాడని స‌మాచారం.  హైద‌రాబాద్..గోవా..ముంబై  న‌గ‌రాల్లో డీజేతో బాగా ఫేమస్. 12 ఏళ్ల క్రితం హైద‌రాబాద్ నుంచి ముంబైకి వెళ్లాడు. తొలుత ప‌బ్ ల్లో వెయిటర్ గా కెరీర్ ప్రారంభించి డ్ర‌గ్ స‌ప్లైయ‌ర్ గా మారిన‌ట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.  డీజే మాటున డ్ర‌గ్ దందాని కొన‌సాగించాడు.  గోవా డ్ర‌గ్స్ కేసులో నిందుతుడిగా ఉన్న ఎడ్విన్ తో ఇత‌నికి మంచి సంబంధాలు ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

అన్ని మెట్రో సిటీల్లో ఉన్న ప‌బ్ ల‌కు ఇత‌ని ద్వారా   డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా  జ‌రుగుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 50 మందికి పైగా  మైరాన్ కి  డ్ర‌గ్  పెడ్ల‌ర్స్ తో సంబంధాలున్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్..బాలీవుడ్ వ్యాపారుల‌తోనూ మైరాన్ మంచి రిలేష‌న్ కొన‌సాగిస్తున్నాడ‌ని చెబుతున్నారు. ముంబై అడ్డాగా  ఈ దందాని కొన‌సాగిస్తున్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు.

మైరాన్ భార్య హీరోయిన్   కావ‌డంతో  మొత్తం  కాంటాక్స్ట్ బ‌య‌ట‌కు తీస్తున్నారు. ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌తో   మైరాన్ కి ఉన్న సంబంధాలు ఎలాంటివి? వంటి  వివ‌రాలు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్..బాలీవుడ్ ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న నేప‌థ్యంలో తాజా స‌న్నివేశం మ‌రింత హీటెక్కిస్తుంది.

ఇప్ప‌టికే  ఈకేసులో కృష్ణ క‌మార్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి  తెలిసిందే. కృష్ణ కుమార్ ఏకంగా ప్ర‌భుత్వ బ‌స్సులోనే పార్శీల్ రూపంలో డ్ర‌గ్స్ త‌ర‌లించేవాడు.  ప్ర‌భుత్వ వాహ‌న‌లు కావ‌డంతో పోలీసులు  పెద్ద‌గా త‌నిఖీ లేకుండా వ‌దిలేసేవారు.

దాన్నే అడ్డాగే మ‌లుచుకుని చీక‌టి దందాని కొన‌సాగించాడు. మ‌రి ఈ కేసు విష‌యంలో నేహా  దేశ్  పాండే ఎలా స్పందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News