హీరో అడిగాడని 25 లక్షలు పెంచేసిందట

Update: 2017-08-21 10:23 GMT
హీరో - హీరోయిన్ ఇలా సినిమాలో కనిపించే ప్రతి పాత్రను ఫైనల్ చేసే రైట్ కేవలం డైరెక్టర్ కే ఉంటుంది. కానీ టాలీవుడ్ ఈ హక్కుని దర్శకుడు కంటే నిర్మాతలు - హీరోలే ఎక్కువుగా వాడుతుంటారు. మిగతా ఇండస్ట్రీలో కూడా ఈ వాడుక ఎక్కువుగానే ఉన్నా తెలుగులో మాత్రం మితిమీరుతూనే ఉందని చెప్పాలి. తాజాగా ఓ టాప్ హీరో అప్ కమింగ్ సినిమాలో ఓ హీరోయిన్ ని తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమాలో నటిస్తున్న హీరోగారి మైండ్ లో వేరే హీరోయిన్ ఉంది. దీంతో ఆ డైరెక్టర్ కి - హీరోకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వలన - హీరోగారి కోరిక మేరకు టాలీవుడ్ ని వదిలేసి ఎక్కడో తమిళ - కన్నడ సినిమాలు చేసుకుంటున్న ఆ ముదురు భామని వెతికి పట్టుకొచ్చారు ఆ చిత్ర నిర్మాతలు.

అయితే తను నటించకపోతే హీరోగారు నటించరని గ్రహించిన ఆ ముదురుభామ - ఒక్కసారిగా తన పారితోషకాన్ని పెంచేసేంది. తనకు రెగ్యులర్ గా వచ్చే రెమ్యూనీరేషన్ కంటే 25 లక్షలు ఎక్కువుగా డిమాండ్ చేసిందట ఆ ముదురు హీరోయిన్. దీంతో ఖంగుతున్న నిర్మాతలు ఒప్పుకున్నాక తిప్పలు తప్పవన్నట్లు ఆ హీరోయిన్ కి ఎక్స్ ట్రా పాతికలక్షలు ఇచ్చి డీల్ సెట్ చేసుకున్నారట. ఇంతవరకు బాగానే ఉంది - ఇప్పుడు దర్శకుడు ఆ హీరోయిన్ తన సినిమాకు సూట్ అవ్వదని నస మొదలుపెట్టాడట. ఆ హీరోని కాదనలేక - కావాలని లేట్ గా షెడ్యూల్స్ షూట్ చేస్తున్నాడని తెలిసింది. అయితే డబ్బుకి వెనుకాడని నిర్మాతలు కావడంతో ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ సజావుగానే సాగుతుందని సమాచారం. కానీ ఈ వ్యవహారం ముదిరితే సినిమా ఆగిపోవడం ఖాయం అనే టాక్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Tags:    

Similar News