సూపర్ హిట్ క్లాసిక్ మూవీ వదులుకోవడంపై హీరోయిన్‌ స్పందన

Update: 2021-06-14 01:30 GMT
బాలీవుడ్‌ క్లాసిక్ మూవీస్ ల్లో ఒకటి కుచ్ కుచ్‌ హోతా హై అనడంలో ఎలాంటి సందేహం లేదు. షారుఖ్‌ ఖాన్ నటించిన ఆ సినిమా కు కరణ్ జోహార్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో షారుఖ్ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ను కరణ్‌ జోహార్ సంప్రదించాడట. అందులో ఐశ్వర్య రాయ్ కూడా ఉందట. సినిమా చిత్రీకరన మొదలు అయిన తర్వాత కూడా ఐశ్వర్య రాయ్‌ ని దర్శకుడు కరణ్‌ జోహార్ సంప్రదించాడనే వార్తలు వచ్చాయి. కాని ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా సినిమా ను చేసేందుకు నిరాకరించింది.

కుచ్‌ కుచ్‌ హోతా హై సినిమా ను ఐశ్వర్య రాయ్ తిరష్కరించడంతో హీరోయిన్ గా రాణి ముఖర్జీ ని నటింపజేశారు. సినిమా కు నో చెప్పడం కు ఏ హీరోయిన్ కూడా కారణం చెప్పలేదు కాని కొన్నాళ్ల తర్వాత స్వయంగా ఐశ్వర్య రాయ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌ తో మాట్లాడుతూ సినిమా ను వదిలేసినందుకు గల కారణంను చెప్పుకొచ్చిందట.

సినిమా లో నటించాలంటే మినీ స్కర్ట్స్ వేసుకోవాల్సి ఉందట. ఆ పాత్ర కోసం కాస్త స్కిన్‌ షో చేయాల్సి ఉంది. ఆ సమయంలో స్కిన్‌ షో చేయడం వల్ల నటించడం చేతకాక పోవడం వల్లే ఐశ్వర్య రాయ్ ఇలా గ్లామర్ పాత్రకు ఓకే చెప్పిందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో తాను ఆ సినిమా ను వద్దనుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఐశ్వర్య రాయ్ మరియు షారుఖ్‌ ఖాన్ లు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. కాని కుచ్‌ కుచ్‌ హోతాహై సినిమా ను వదిలేసినందుకు మాత్రం ఆమె చాలా ఫీల్ అయ్యిందట.



Tags:    

Similar News