మహేష్‌ ప్రశంసతో అమ్మడు ఉబ్బితబిబ్బు

Update: 2020-07-20 06:00 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇటీవల తమిళ మూవీ ‘ఓ మై కడవలే’ ను చూశాను.. ప్రతి సీన్‌ ను ఎంజాయ్‌ చేశాను. ప్రతి ఒక్కరి నటన అద్బుతంగా ఉంది. దర్శకుడు చాలా బాగా సినిమాను తెరకెక్కించాడంటూ ట్వీట్‌ చేశాడు. మహేష్‌ బాబు ఆ ట్వీట్‌ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఆ చిత్రం గురించి తెలుగు నెటిజన్స్‌ సెర్చ్‌ చేస్తున్నారు. సినిమాను తమిళ వర్షన్‌ లోనే చూసేందుకు సిద్దం అవుతున్నారు. మహేష్‌ ట్వీట్‌ తో సినిమా తెలుగులో కూడా రీమేక్‌ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

మహేష్‌ ట్వీట్‌ పై సినిమాలో హీరోయిన్‌ గా నటించిన రితికా సింగ్‌ స్పందించింది. సూపర్‌ స్టార్‌ ట్వీట్‌ చేయడం నమ్మలేకపోతున్నానంది. థ్యాంక్యూ సో మచ్‌.. ఇలాంటి ప్రశంస మీ నుండి రావడం చాలా చాలా సంతోషంగా ఉందంటూ రితికా ట్వీట్‌ చేసింది. సూపర్‌ స్టార్‌ నుండి ప్రశంస అంటే ఆమాత్రం సంతోషంగా ఉండటం చాలా కామన్‌ కదా. రితికతో పాటు ఓ మై కడవలే చిత్ర ఇతర యూనిట్‌ సభ్యులు కూడా మహేష్‌ ట్వీట్‌ పట్ల చాలా సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో యంగ్‌ స్టార్‌ హీరోతో ఓ మై కడవలే ను రీమేక్‌ చేయాలని ప్రముఖ నిర్మాత భావిస్తున్నాడట. ఇప్పటికే రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నారని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్‌ బాబు ట్వీట్‌ చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఓ మై కడవలే రీమేక్‌ పనులు మరింత స్పీడ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News