పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తోంది. 'పింక్' రీమేక్ గా తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామాలో లాయర్ పాత్రలో పవన్ అదరగొట్టాడు. ఇన్నాళ్లు మాతృకను చెడగొడుతున్నారనే విధంగా ప్రమోషనల్ కంటెంట్ వదిలిన మేకర్స్.. ట్రైలర్ తో వారందరికి సమాధానం చెప్పారు. కోర్టు సన్నివేశాలు - డైలాగ్స్ అన్నీ 'పింక్' ను గుర్తు చూసేలా ఉన్నాయి. ఇది మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల అంశాన్ని చర్చించే సినిమాగా.. నివేదా - అంజలి - అనన్య పాత్రలను హైలైట్ చేస్తూ చూపించారు. అదే సమయంలో పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని 'వకీల్ సాబ్'లో కొత్త అంశాలు ఏమేమీ జత చేశారో అనేది ఈ ట్రైలర్ లో తెలియనీయకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు.
'వకీల్ సాబ్' చిత్రంలో పవన్ కళ్యాణ్ కోసం కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ని జత చేసి హీరోయిన్ ని పెట్టారనే విషయం తెలిసిందే. అదనంగా ఫైట్స్ - సాంగ్స్ వంటి కమర్షియల్ హంగులు కూడా వచ్చి చేరాయి. అయితే1 ట్రైలర్ లో కేవలం యాక్షన్ పార్ట్ నే చూపించిన మేకర్స్.. కొత్తగా చేర్చిన ఎపిసోడ్స్ ని సర్ప్రైజ్ లాగా దాచి పెట్టేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ శ్రుతి హాసన్ ను ట్రైలర్లో చూపించలేదు. శృతితో ఉండే చిన్న షాట్ కూడా లేకుండా చూసుకున్నారు. శృతి హాసన్ ని దాచడం అనేది ఆమె అభిమానులను నిరాశ పరిచినా.. అలా సీక్రెట్ గా ఉంచడం కూడా సినిమాకి ప్లస్ అవుతుందని కామెంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ తెలిసిన కథే కావడంతో ఆడియన్స్ ని ఇలాంటి విషయాలు థియేటర్లకు నడిపిస్తాయని అంటున్నారు. ప్రస్తుతానికైతే 'పింక్' చిత్రంలోని మెయిన్ పాయింట్ ని అలాగే తీసుకొని ఫైట్స్ యాడ్ చేసినట్లు ట్రైలర్ ద్వారా తెలియజెప్పారు. మరి 'వకీల్ సాబ్' రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకుల్లో ఇదే అభిప్రాయం ఉంటుందో లేదో చూడాలి.