బన్నీ కొత్త సినిమాలో హీరొయిన్ ట్విస్ట్

Update: 2019-05-21 05:25 GMT
ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని కొంత గ్యాప్ తీసుకుంది. సమ్మర్ వేడికి తాళలేక ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వెళ్లిపోయిన బన్నీ ఇవాళో రేపో వచ్చేస్తాడు. ఎక్కువ ఆలస్యం లేకుండా వెంటనే కంటిన్యూ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉండగా ఇందులో సెకండ్ హీరొయిన్ గా నటిస్తున్న అమ్మాయి కేతిక శర్మ.

మెయిన్ లీడ్ కాకపోయినా ఓ పాటతో పాటు కీలకమైన కొన్ని సన్నివేశాలు ఉంటాయి. పూరి ఆకాష్ రొమాంటిక్ తో డెబ్యు చేస్తున్న హీరొయిన్ ఈ పాత్ర ఒప్పుకోవడానికి కారణం అదే. త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరొయిన్ అయినా ప్రాధాన్యత తగ్గకుండా కథలో భాగంగా ఉంటుంది. గతంలో వచ్చిన సినిమాల్లో జరిగింది ఇదే. కేతిక శర్మ ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే

ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం నిజానికి దీనికి ఇంకో తెలుగు అమ్మాయిని ఛాయస్ గా పెట్టుకున్నారట. తను గతంలో త్రివిక్రమ్ మూవీలో చేసింది కూడా. బన్నీ సినిమాలో పాత్ర కొంచెం గ్లామర్ ఫీల్ అవసరం కావడంతో ఆ మేరకు గతంలో చేయని తరహలో హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని వైరల్ చేసింది. ఇంతా చేస్తే త్రివిక్రమ్ తనను కాకుండా ఫ్రెష్ బ్యూటీ కేతిక శర్మకు ఓటు వేశాడు.

ఇది హీరో నిర్ణయమా లేక ఇంకోటా అనేది తెలియలేదు కాని పాపం ఈ తెలుగు బ్యూటీ హర్ట్ అయిపోయి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ తమిళ్ మూవీ చేస్తున్న ఈ అమ్మడు ఇక్కడ లాభం లేదని చెన్నైలో మకాం వేసి కోలీవుడ్ లోనే గట్టి పాగా వేయాలని ఫిక్స్ అయినట్టు ఫిలిం నగర్ టాక్. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలో మాములే కాని స్టార్ హీరోల విషయంలో జరిగినప్పుడు ఇదుగో ఇలా ఎక్కువ చర్చకు ప్రచారానికి దారి తీస్తాయి


Tags:    

Similar News