బ్యూటీలంతా బెల్లీ డ్యాన్స్ మీద పడ్డారే!

Update: 2019-08-08 01:30 GMT
ప్రెజెంట్ జెనరేషన్ లో గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న భామలందరూ ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నారు.  ఈ విషయం అందరికీ తెలిసిందే. తిండైనా మానుకుంటారు.. మేకప్పైనా వేసుకోకుండా కనిపిస్తారు కానీ కసరత్తులు చేయకపోతే రోజు గడవదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.  యోగానో.. వెయిట్ ట్రైనింగో.. ఏరోబిక్సో.. జుంబా డ్యాన్సో.. ఏదో ఒకటి తప్పకుండా చేయడం భామలకు అలవాటుగా మారింది.  అయితే ఈమధ్య మరో ట్రెండ్ కూడా మొదలైంది. అదే బెల్లీ డ్యాన్స్.. అదేదో సినిమాలో 'నాకు బెల్లం అంటే ఇష్టం' అన్నట్టుగా ఈ పాపలందరూ 'నాకు బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్నారు.

ఇప్పటికే ఈ బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న భామల లిస్టు చాలా పెద్దది.  శ్రీదేవి డాటర్ జాహ్నవి కపూర్.. అనన్య పాండే.. షారూఖ్ డాటర్ సుహానా లాంటివారు బెల్లీ డ్యాన్స్ లో మెళకువలు నేర్చుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు.  ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే చేంతాడంత అవుతుంది.  ఈ లిస్టులో తాజాగా బ్యూటిఫుల్ రకుల్ కూడా జాయిన్ అయింది.  రకుల్ ప్రస్తుతం హిందీ లో 'మర్జావా' అనే చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా.. రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్.  ఈ సినిమాలో ఒక పాట కోసం బెల్లీ డ్యాన్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టిందట.  అంతే కాదు తను రెగ్యులర్ గా చేసే ఎక్సర్ సైజులకు లిస్టులో ఇది మరో ఎక్సర్ సైజ్ అని చెప్పుకొచ్చింది.  ఫ్లాట్ యాబ్స్.. బెటర్ డ్యాన్సింగ్ స్కిల్స్  కోసం ఈ బెల్లీ డ్యాన్స్ ను ఇకపై కంటిన్యూ చేస్తానని చెప్తోంది.
 
అలా అని అందరూ నాకు బెల్లీ డ్యాన్స్ అంటేనే ఇష్టం అంటున్నారని ఫిక్స్ అయిపోకండి.  టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 'ఇండియన్ 2' కోసం కేరళ మార్షల్ ఆర్ట్స్ 'కలరియపట్టు' నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోందట. ప్రస్తుతం కాజల్ హ్యాపీగా కొబ్బరినూనె వంటలు తింటూ కలరియపట్టుపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోందట. ఈ బ్యూటీలు చేసే కఠినమైన కసరత్తులు.. కొత్త కొత్త నాట్యాలు చూస్తుంటే మన ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడి... కో వెళ్ళిపోతున్నట్టు అనిపించడంలేదా మీకు?


Tags:    

Similar News