కేశవ’ సినిమా కోసం నిఖిల్ కొత్త అవతారం చూసి జనాలు షాకైపోయారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ గడ్డం పెంచి.. బాడీ పెంచి.. కొత్తగా తయారయ్యాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో నిఖిల్ ఎంత చిత్రంగా కనిపించాడో తెలిసిందే. ఐతే స్కెచ్ తరహాలో ఉన్న ఆ లుక్ తర్వాత నిఖిల్ పూర్తి స్థాయి లుక్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఈలోపు ‘కేశవ’ హీరోయిన్లను పరిచయం చేసింది చిత్ర బృందం. మహిళా దినోత్సవం సందర్భంగా ‘కేశవ’తో జోడీ కట్టబోతున్న ‘పెళ్లిచూపులు’ భామ రీతూ వర్మతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇషా కొప్పికర్ లుక్ ను కూడా పరిచయం చేశారు.
రీతు క్యూట్ గా కనిపిస్తే.. ఇషా ఫెరోషియస్ గా దర్శనమిచ్చింది. అప్పట్లో ‘చంద్రలేఖ’లో మెరిసి మాయమైన ఇషా.. ఇందులో కథను మలుపు తిప్పే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. లుక్ చూుస్తే ఆమెది పోలీస్ తరహా పాత్ర లాగా ఉంది. ‘సూర్య వెర్సస్ సూర్య’ తరహాలో చిత్రమైన జబ్బున్న కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు నిఖిల్ ‘కేశవ’లో. ఉద్రేకం తెచ్చుకుంటే ప్రాణాపాయంలో పడేలా ఉంటుంది అతడి పాత్ర. ఐతే ఆ ఉద్రేకాన్ని అణచుకుని అతను పగ తీర్చుకోవాల్సి ఉంటుంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ కాన్సెప్టుతో సుధీర్ వర్మ ఎలాంటి సినిమా తీశాడో చూడాలి. మే 12న ఈ చిత్రం ప్రేక్షకల ముందుకు రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/