కుమారి కోసం క్యూ కట్టిన హీరోయిన్లు

Update: 2015-10-26 06:46 GMT
డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి.. తొలిసారిగా తీసిన చిత్రం కుమారి 21ఎఫ్. ఈ సినిమా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం కోసం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది యూనిట్. అదే డబ్ స్మాష్. ఈ మూవీ టీజర్ లోని హీరోయిన్ డైలాగ్స్ ని చెప్పాల్సి ఉంటుంది పోటీదారులు.

స్టార్ హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కాంటెస్ట్ భలే రసవత్తరంగా మారిందిపుడు. మహేష్ తో కలిసి సుకుమార్ డైరెక్షన్ లో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించిన క్రితి సనోన్.. నా పేరు కుమారి - నా ఏజ్ 21 - ఐ యామ్ ఏ ఫిమేల్.. అంటూ డబ్ స్మాష్ అదరగొట్టేసింది.  ఆ తర్వాత ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'నాన్నకు ప్రేమతో' మూవీలో నటిస్తున్న రకుల్  ప్రీత్ సింగ్ కూడా పెదవి కదిపింది.

వీళ్లిద్దరి ఉత్సాహం చూశాక.. మరింత మంది హీరోయిన్స్ వీరికి తోడయ్యారు. ప్రణీత - అనసూయ - రెజీనాలు కూడా అలరించేశారు. కుమారి 21ఎఫ్ ప్రమోషన్ లో భాగంగానే వీళ్లంతా డబ్ స్మాష్ బాట పట్టారని అర్ధమవుతున్నా.. ఒకే డైలాగ్ ని ఇంతమంది హీరోయిన్స్ చెప్తుంటే మాత్రం చూడ్డానికి భలే ఎక్సైటింగ్ గా ఉందని చెప్పచ్చు.

Full View
Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News