శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజన గల్రానీ - రాగిణి ద్వివేది డ్రగ్స్ సేవించినట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి (CFSL) నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజన సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు దయచేసి నిరాధారమైన తప్పుడు మీడియా ట్రయలల్స్ ను ఆపాలని కోరుతూ ఓ లెటర్ ను షేర్ చేసింది.
''కేసు ప్రారంభమైన రోజు నుండి నా మానసిక ఆరోగ్యం మరియు నిద్ర రుగ్మతల కోసం డాక్టర్ల సూచనతో నేను రోజుకు వివిధ యాంటి యాంగైటీ టాబ్లెట్‌లు/ స్లీపింగ్ పిల్స్ / పెయిన్ కిల్లర్స్ వంటివి 16 టాబ్లెట్స్ వేసుకుంటాను. నేను 3 నెలల పాటు రోజుకు 12 గంటలు ఏడ్చాను. ఏడుపు ఆపడానికి, రోజంతా నిద్రపోవడానికి వారు నాకు మూడ్ ఎలివేటర్ ల అధిక మోతాదు ఇచ్చారు. ఈ మెడికేషన్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయనేది అధికారికంగా రికార్డుల్లో నమోదైంది. అందువల్ల FSL నివేదిక సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండటం పెద్ద విషయం కాదు''
''కోర్టులపై గౌరవం ఉంచి న్యాయం జరుగుతుందని మనం విశ్వసిస్తాం. మొత్తం కథ తెలుసుకోకుండా నాపై ఆరోపణలు చేయకండి. మీ TRP కోసం నన్ను ఉపయోగించుకోవడం మానేయండి. నా జీవితం సాధారణ స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అంశంపై నిరాధారంగా సెన్సేషన్ చేయడం ద్వారా ఇది నా మానసిక ప్రశాంతతకు మరియు నా కుటుంబానికి భంగం కలిగిస్తోంది. దయచేసి నాపై ఆరోపణలు చేస్తున్న వారిని శిక్షించవద్దని ఆశీర్వదించమని నేను దేవుడిని ప్రార్థిస్తాను'' అని సంజన పేర్కొన్నారు.
ఇకపోతే సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తల్లి రేష్మా గల్రాని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. అన్నింటికీ తలరాత బాగుండాలని ఆమె అన్నారు. అలానే డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై మరో నిందితురాలు రాగిణి ద్వివేది కూడా స్పందించారు. దేవుడి ప్రణాళికపై భరోసా ఉండాలని.. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదని.. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాలో మాట్లాడటానికి నిరాకరించారు.