హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్న ట్రెండ్ సౌత్ లో స్పీడ్ అందుకుంది. బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పట్నుంచో ఉన్నా తెలుగులో - సౌత్ ఇండస్ర్టీలో మాత్రం ఆ స్థాయిలో లేదు. ఇటీవలి కాలంలో మాత్రం పూర్తిగా ట్రెండ్ మారింది. సినిమానే నమ్మి ముందుకెళ్లాలన్న లక్ష్యంతో హీరోయిన్లు సొంతంగా బ్యానర్ లు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. భానుమతి - జయచిత్ర - విజయనిర్మల - రాధిక - మంజుల - శ్రీప్రియ వంటి సీనియర్ నటీమణులు నిర్మాతలుగా, దర్శకులు(వీళ్లలో కొందరు)గానూ పేరు తెచ్చుకున్నారు. ఆ బాటలోనే ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. మాజీ భార్య రేణు దేశాయ్ .. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. దర్శకురాలిగానూ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు.
సీనియర్ నటీమణి శ్రీప్రియ రాజ్ కుమార్ థియేటర్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నారు. మేటి నాయిక రాధిక రాడాన్ సంస్థ లో టెలీ సీరియళ్లతో పాటు సినిమాలు నిర్మిస్తున్నారు. మరో నాయిక కుష్బూ అవ్ని సినీమ్యాక్స్ పతాకంపై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల్ని తీశారు. ఇటీవలి కాలంలో సూర్య భార్య జ్యోతిక 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ప్రారంభించి సినిమాల్ని నిర్మిస్తున్నారు. అందులో తను కూడా నటిస్తున్నారు. అలాగే మరో మేటి నాయిక సిమ్రాన్ స్వయంగా తనపేరుతోనే సిమ్రన్ అండ్ సన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించేందుకు ముందుకొచ్చారు.
కథానాయిక స్నేహ సొంత బ్యానర్ లో భర్త ప్రసన్న హీరోగా సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ హీరోయిన్ అమలాపాల్ నిర్మాతగా ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. భర్త ఏ.ఎల్ విజయ్ సపోర్టుతో అమలాపాల్ ముందుకెళుతోంది. సిల నిమిషంగల్ అనేది టైటిల్ తో అవార్డులే లక్ష్యంగా సినిమా చేస్తున్నారు. ఇలా వెతికితే మేటి నాయికలంతా ఏదో ఒక కారణంతో కుటుంబ సభ్యుల్ని ప్రమోట్ చేసుకునేందుకు నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నారు.