'హీరో పంతి- 2' ట్రైల‌ర్ టాక్: టైగ‌ర్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్ టైన‌ర్!

Update: 2022-03-17 10:39 GMT
బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాప్ యాక్ష‌న్ సీన్స్ ఎలివేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జాకీ ష్రాప్ వార‌సుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన  టైగ‌ర్ ష్రాప్ అన‌తి కాలంలో బెస్ట్ యాక్ష‌న్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. హృతిక్ రోష‌న్  త‌ర్వాత యాక్ష‌న్ స్టార్ గా అంత‌టి పేరు టైగ‌ర్ ష్రాప్ కి ద‌క్కింది. అత‌ని ఫిజిక్..శ‌రీరాన్ని విల్లు లా వంచే ప్లెక్సీబిలిటీ ఎప్ప‌టిక‌ప్పుడు ఓ రేంజ్ లో హైలైట్ అవుతుంటుంది. తెరంగేట్రం మూవీ `హీరోపంతి`తోనే మొట్ట మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్నాడు.

ఆ త‌ర్వాత త‌న‌లో స‌క్సెస్ పాయింట్ ని ప‌ట్టుకుని మరిన్ని యాక్ష‌న్ సినిమాలు చేసి త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం  `హీరోపంతి`కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న` హీరోపంతి-2`లో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. తారా సుతిరియా హీరోగాయిన్  న‌టిస్తుండ‌గా..న‌వాజుద్దిన్ సిద్దిఖీ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. అన్ని ప‌న‌లు పూర్తిచేసుకుని ఏప్రిల్ 29న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా మేక‌ర్స్ చిత్ర ట్రైల‌ర్ ని  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.

`యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ట్రైల‌ర్ ఆద్యంతం ఒళ్లు గగుర్లు పొడిచే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకుంటుంది. సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో సాగే స్టోరీలో  యాక్ష‌న్ స‌న్నివేశాలే ప్ర‌ధానంగా హైలైట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందులో న‌వాజుద్దీన్ సిద్దిఖి  మానసిక నిపుణు పాత్ర‌లో విల‌న్ గెట‌ప్ లో ఆక‌ట్టుకుంటున్నాడు. సైబ‌ర్ వ్య‌వ‌స్థ‌ని శాశించే డాన్ గానూ హైలైట్ అవుతున్నాడు. ప్ర‌పంచం అత‌ని వినాశ‌నాన్ని కోరుకుంటే..అత‌ను మాత్రం ప్ర‌పంచాన్నే నాశ‌నం చేయాల‌ని చూస్తాడు. న‌వాజ్ భ‌యంక‌ర‌మైన విల‌న్ పాత్ర హైలైట్ అవుతుంది. లైలాని అన్వేషించే బ‌బ్లూ ర‌నావ‌త్ పాత్రలో  యంగ్ టైగ‌ర్ ఎలివేష‌న్స్ బాగున్నాయి.

యాక్ష‌న్ స‌న్నివేశాల్లో  టైగ‌ర్ ష్రాప్ మ‌రోసారి త‌న‌దైన మార్క్ వేసాడు. కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలైతే పీక్స్ లో ఉన్నాయ‌ని చెప్పొచ్చు. ట్రైల‌ర్ నే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో నింపేసారు. ఇక ఫుల్ ర‌న్ లో టైగ‌ర్ యాక్ష‌న్ ఊహ‌కంద‌దు. హీరోయిన్ తారా సుతారియా పాత్ర కేవ‌లం రొమాన్స్ కే ప‌రిమితంలా క‌నిపిస్తుంది.

గ్లామ‌ర్ షో..లిప్ లాక్ లు సినిమాలో ట్రైల‌ర్ లో హైలైట్ అవుతున్నాయి. ఏ. ఆర్ రెహ‌మాన్ బీజీఎమ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం ర‌ష్యా..ఆఫ్రికా..చైనా..ఈజిప్ట్  దేశాల్లో జ‌రిగింది. మొత్తంగా `హీరోపంతి-2` టైగ‌ర్ ష్రాప్ యాక్ష‌న్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు ప‌క్కా యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా కనిపిస్తుంది.Full View
Tags:    

Similar News