హిట్‌ సినిమా సీక్వెల్‌ లో మెగా బ్రదర్స్‌?

Update: 2022-05-12 07:30 GMT
తమిళ మెగా బ్రదర్స్ గా పేరు దక్కించుకుని ఇండస్ట్రీలో దూసుకు పోతున్న సూర్య మరియు కార్తీ లు కలిసి నటించే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా వీరిద్దరి మల్టీ స్టారర్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరి మల్టీ స్టారర్ మూవీ గురించి మీడియాలో చర్చ జరుగుతోంది.  అదుగో ఇదుగో అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా మరోసారి వీరిద్దరి కాంబో మల్టీ స్టారర్ మూవీ గురించి చర్చ మొదలు అయ్యింది. కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ సీక్వెల్‌ పనులు మొదలు పెట్టాడు.

ఆయన దర్శకత్వంలో రూపొందిన కమల్‌ 'విక్రమ్‌' విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెల 3 న విడుదల కాబోతున్న విక్రమ్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ జులై లోనే ఖైదీ సీక్వెల్‌ ను పట్టాలెక్కిస్తాడనే వార్తలు వస్తున్నాయి. కార్తీ కూడా సీక్వెల్‌ కోసం చాలా ఆసక్తిగా ఉన్నాడు కనుక వెంటనే డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడు.

తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఖైదీ సీక్వెల్‌ లో సూర్య కూడా నటించబోతున్నాడట. కథానుసారం ఒక పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను సూర్య తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై ఉన్న నమ్మకం మరియు ఆయన స్టార్‌ డమ్‌ నేపథ్యంలో సూర్య సీక్వెల్‌ లో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.

తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి స్టార్‌ డమ్‌ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించడం వల్ల ఖచ్చితంగా సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్‌ అవ్వడం ఖాయం. అక్కడ ఇక్కడ భారీగా సినిమా స్థాయి పెరుగుతుంది. కనుక సూర్య నటించడం అనేది మంచి నిర్ణయం అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.

లోకేష్‌ కనగరాజ్‌ వరుసగా బ్లాక్‌ బస్టర్ సక్సెస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. కమల్‌ హాసన్ కు విక్రమ్ సినిమా తో ఖచ్చితంగా మంచి విజయాన్ని అందిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. విక్రమ్‌ సినిమా కనుక సూపర్‌ హిట్‌ అయితే అప్పుడు ఖైదీ సీక్వెల్‌ కు విపరీతమైన బజ్ క్రియేట్‌ అవ్వడం.. దానికి తోడు సూర్య కూడా నటించడం తో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.
Tags:    

Similar News