శ్రీమంతుడి కోర్టు కష్టాల నుంచి విముక్తి లభించలేదు. సినిమా విడుదలై రెండేళ్లయినా కాపీరైట్స్ కేసు నుంచి ప్రిన్స్ మహేష్ బయటపడలేదు. ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానందుకు హీరో మహేష్ బాబు - దర్శకుడు కొరటాల శివ - నిర్మాత ఎర్నేని నవీన్ లపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వీరు చేసిన విన్నపాన్ని కోర్టు గతంలోనే తిరస్కరించింది.
అయినప్పటికీ ఈ ముగ్గురూ తర్వాతి వాయిదాకు కోర్టుకు హాజరు కావడంతో వారిపై ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో కేసు మరింత జఠిలంగా మారే అవకాశముంది. ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ నిర్మాణ భాగస్వామి కావడంతో అతడి మీదా కేసు నమోదైంది. ఈ కాపీరైట్స్ కేసు నుంచి మహేష్ కు ఎప్పుడు ఊరట లభిస్తుందో వేచి చూడాలి.
తన కథను అనుమతి లేకుండా వాడుకున్నారని శరత్ చంద్ర అనే రచయిత కోర్టుకెళ్ళిన సంగతి తెలిసిందే. తాను ‘స్వాతి’ వార పత్రికకు రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలను కాపీ కొట్టి ‘శ్రీమంతుడు’ సినిమా తీసినట్లు అతడు ఆరోపించాడు. మొదట్లో శ్రీమంతుడు టీం ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు.
కోర్ట్ బయట ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు కూడా జరిగాయి. కానీ వివాదం పరిష్కారం కాలేదు. అయితే, కొన్ని నెలల కిందట శరత్ చంద్ర తనకు డబ్బులు అక్కర్లేదని, ‘శ్రీమంతుడు’ హిందీ వెర్షన్ టైటిల్స్‌లో తనకు కథకుడిగా క్రెడిట్ కావాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/