సంక్రాంతి కానుకగా భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అంతకుముందే డిసెంబర్ లోనూ పలు భారీ క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే వీటన్నిటికీ అనుకూలంగా హైకోర్టు తీర్పు పెద్ద ఊరట. త్వరలో విడుదల కానున్న ఆర్.ఆర్.ఆర్- భీమ్లా నాయక్ - పుష్ప- అఖండ- రాధేశ్యామ్ సినిమాల టిక్కెట్ రేట్లను పెంచేందుకు తెలంగాణ హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు- రాష్ట్ర ప్రభుత్వానికి రేట్ల పెంపు కోసం దరఖాస్తులు చేసుకున్న థియేటర్లకు కోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయి.
సినిమా థియేటర్ల యజమానులు దాఖలు చేసిన పిటీషన్ ల బ్యాచ్ పై జస్టిస్ విజయసేన్ రెడ్డి న్యాయమూర్తిగా వ్యవహరించారు. టికెట్ రేటు పెంపుపై తమ అభ్యర్థనను పరిష్కరించడానికి అధికారులకు అవసరమైన ఆదేశాలను అభ్యర్థించారు. చాలా కాలంగా తమ దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
అన్ని కేటగిరీల (తరగతులు) టికెట్ ధరలను ఇప్పుడున్న ధరల్లో కనీసం 50 శాతం పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదిస్తూ 2017లో జారీ చేసిన జిఓ 75ని అమలు చేయకపోవడంతో థియేటర్ల యజమానులు టిక్కెట్ ధరలను పెంచలేకపోయారు. సినీ ప్రేక్షకుల తరపున న్యాయవాది జిఎల్ నరసింహారావు వాదిస్తూ ప్రేక్షకుల తరపున తాను ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశానని ఉత్తర్వులు వచ్చేలోపు తన పిటిషన్ ను స్వీకరించాలని కోర్టును అభ్యర్థించారు.
అయితే ఇంప్లీడ్-పిటీషన్ ను తర్వాత విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కొత్త సినిమా షోల కోసం రేట్లను పెంచడానికి థియేటర్లను అనుమతించాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కో టికెట్ పై రూ.50 అదనంగా పెంచుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది. దీనివల్ల చాలా భారీ సినిమాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.