తమిళ.. తెలుగు నటుడు విశాల్ కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనే మాత్రం అంచనా వేయలేని విధంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామం విశాల్ కు నష్టం కలిగించేదిగా భావిస్తున్నారు. ఇంతకూ హైకోర్టు తాజా ఆదేశం ఏమిటి? విశాల్ కు అదెందుకు షాకింగ్ గా మారిందన్నది చూస్తే..
సినీ నటుడు విశాల్.. దక్షిణ భారత నటీనటుల సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచిన విశాల్ పదవీకాలం ఈ మధ్యనే ముగిసింది. సాధారణంగా పదవీ కాలం ముగిసిన వెంటనే.. ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే.. అనుకోని ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.
నిర్మాతల మండలిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్న విశాల్ వాదనకు భిన్నంగా.. పళని సర్కార్ విశాల్ కు వ్యతిరేక వర్గమైన దర్శకుడు భారతీరాజా.. నటుడు కే రాజన్.. టీజే త్యాగరాజన్ తో కలిపి తొమ్మిది మందితో ఒక అడహక్ కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని విశాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
న్యాయపోరాటంలో భాగంగా ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న మండలికి ప్రభుత్వం అడహక్ కమిటీ ఏర్పాటు చేయటాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఊహించని రీతిలో ఆదేశాల్ని జారీ చేసింది. ప్రభుత్వం నియమించిన తాత్కాలిక సలహా అడహక్ కమిటీని రద్దు చేయలేమని పేర్కొంది. అయితే.. అడహక్ కమిటీ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశాలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని తొలగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని భావించిన విశాల్ వర్గానికి తాజా పరిణామం భారీ షాక్ గా మారిందని చెప్పక తప్పదు.