తెలంగాణకు చెందిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ కు సినీ స్టూడియో నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని తెలంగాణ సర్కార్ అప్పట్లో కేటాయించింది. రంగారెడ్డి జిల్లా మోకిల్లలో ఈ ఎకరాలను ఇచ్చింది. అయితే కోట్ల విలువైన ఈ భూమిని మార్కెట్ రేటును బట్టి కేటాయిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు.. ఎకరా 5 లక్షలకే కేటాయించడం వివాదాస్పదమైంది.
నాడు హైదరాబాద్ లోని విలువైన ప్రాంతంలో ఏకంగా ఐదెకరాల భూమిని ఎకరా రూ.5లక్షల చొప్పున కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అయితే ఇంత చీప్ గా భూకేటాయింపుపై కొందరు హైకోర్టుకు ఎక్కారు.
హైకోర్టు తాజాగా దీనిపై విచారణ చేపట్టింది. రూ.2.50 కోట్ల విలువైన భూమిని ఎంతో తక్కువ ధరకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని కోరింది.
దీనిపై ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్పందిస్తూ.. ఏజీ క్వారంటైన్ లో ఉన్నారని.. తమకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో హైకోర్టు ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.