తమిళనాట సంచలనంగా మారిన చిన్మయి విషయం అటు ఇటు తిరిగి కోర్టును చేరింది. మీటూ అంటూ చిన్మయి కొన్నాళ్ల క్రితం వైరముత్తు మరియు రాధ రవిలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె డబ్బింగ్ అసోషియేషన్ కు చెల్లించాల్సిన ఫీజు చెల్లించని కారణంగా సభ్యత్వంను రద్దు చేస్తున్నట్లుగా డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు రాధ రవి ప్రకటించాడు. శాస్వత సభ్యత్వం ఉన్న తనను ఎలా తొలగిస్తారంటూ అప్పటి నుండి కూడా చిన్మయి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే ఉంది. తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ విషయమై స్పందించాలని చాలా సార్లు ఆమె డిమాండ్ చేసింది.
నవంబర్ లో ఈమె సభ్యత్వంను రద్దు చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ వారు నిర్ణయం తీసుకుంది. పలుసార్లు అసోషియేషన్ సభ్యులను బెదింరించినా, మరో విధంగా చెప్పినా కూడా ఆమెకు సభ్యత్వంను తిరిగి ఇచ్చేందుకు పలు కండీషన్స్ పెట్టడం జరిగింది. దాంతో ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. ఆమె పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ సమయంలో ఆమెపై ఉన్న నిషేదంను ఎత్తి వేస్తూ స్టే విధించింది. డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ లో ఆమెపై ఉన్న నిషేదానికి స్టే విధించడంతో పాటు అసోషియేషన్ అధ్యక్షుడు అయిన రాధారవికి నోటీసులు జారీ చేయడం జరిగింది. చిన్మయి సభ్యత్వంను రద్దు చేయడానికి గల తగు కారణాలను వెళ్లడించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 25వ తేదీ వరకు రాధారవి మద్రాస్ హైకోర్టుకు రాధారవి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ తరపును సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
తన నిషేదంపై స్టే విధించడంపై ఆనందం వ్యక్తం చేసిన చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ పై న్యాయ పోరాటంను చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించింది. ఈ స్టే పరిమితం అన, తనపై ఉన్న నిషేదం పూర్తిగా ఎత్తి వేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.