నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడీ సినిమాకి పన్ను మినహాయింపుల అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సినిమా విడుదలకు ముందే పిల్ దాఖలు అయినా.. రిలీజ్ కి అడ్డంకి కాకూడదనే ఉద్దేశ్యంతో.. విచారణను అప్పట్లో వాయిదా వేసిన కోర్టు.. ఇప్పుడు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండానే.. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇచ్చిందని పేర్కొన్న పిటిషనర్.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జీఓ ఇచ్చిందని అన్నాడు. పన్ను మినహాయింపు ప్రకటించేందుకు ఎటువంటి విధానాన్ని అవలంబించారో తెలియచెప్పాలంటూ.. ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే మినహాయింపునకు సంబంధించిన పత్రాలను కూడా కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేసింది హైకోర్టు. ఆ సమయానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల తమతమ వాదనలతో అఫిడవిట్ జారీ చేయాల్సి ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/