తమిళ, తెలుగు భాషల్లో హాస్యనటిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న తమిళ నటి కోవై సరళ. తెలుగు సినిమాల్లో బ్రహ్మానందంకు హిట్ పెయిర్ గా కనిపించి ప్రేక్షకుల్ని తనదైన మార్కు హాస్యంతో నవ్వులు కురిపించింది. విలక్షణమైన మేనరిజమ్స్ తో హాస్య నటిగా తమిళ, తెలుగు భాషల్లో ప్రత్యేకతని చాటుకున్న కోవే సరళ 2015లో త్రిష నటించిన `నాయకి` తరువాత తెలుగు సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది. తను నటించిన తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నా కానీ తెలుగు సినిమాలకు మాత్రం కోవై సరళ వయసు రీత్యా దూరంగా వుంటూ వస్తోంది.
తమిళం సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్న కోవై సరళ ఇప్పటి వరకు తమిళంలో 160కి పైగా సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన 169వ మూవీ `సెంబి`. ప్రభు సాల్మన్ దర్శకుడు. `ప్రేమ ఖైదీ`, అరణ్య వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రభుసాల్మన్ ఈ మూవీని రూపొందించాడు. రానాతో ప్రభు సాల్మన్ చేసిన `అరణ్య` మంచి సందేశంతో రూపొందినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా తరువాత కొంత విరామం తీసుకున్న ప్రభు సాల్మన్ మరో విభిన్నమైన కథతో తాజాగా `సెంబి` మూవీని రూపొందించాడు. ఇందులో కోవై సరళ కీలక పాత్రలో నటించింది. అశ్ఇన్ కుమార్, తంబి రామయ్య ఇతర పాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ తన ప్రతీ సినిమాని కొండలోయల్లో, అడవుల్లో నివసించే గిరిజనుల నేపథ్యంలో చేస్తుంటారు. వారి జీవితాల్లోని సంఘటనలని కథలుగా ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. `సెంబి` సినిమాకు కూడా ఇదే తరహాలో తన మనవరాలిపై హత్యాయత్నం చేసిన వారిపై ఓ మహిళ చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించాడు.
ఎలాంటి హడావిడీ లేకుండా ఈ మూవీ తమిళంలో డిసెంబర్ 30న విడుదలైంది. గతంలో ఈ మూవీలోని కోవై సరళ స్టిల్స్, ఆమె మేకోవర్ పలువురిని షాక్ కు గురిచేసింది. గతంలో చేయని సరికొత్త పాత్రలో కోవై సరళ నటించిన తీరు పట్ల పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరతాయి పాత్రలో కోవై సరళ పలికించిన అభినంపై ప్రస్తుతం విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కమల్ హాసన్ సైతం ప్రశంసలు కురిపిస్తుండటంతో `సెంబి` ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
సామాజిక సమస్య నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ఈ మూవీ సీరియస్ కంటెంట్ నేపథ్యంలో సాగుతూ కోవై సరళ, చైల్డ్ ఆర్టిస్ట్ నీలా నటనతో కట్టిపడేస్తోందట. ఈ మూవీ తెలుగులో థియేటర్లలోకి రావడం కష్టమే కానీ ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.