పెద్ద నోట్ల బాధలు.. ఈ స్టార్ కు లేవులే

Update: 2016-11-14 04:25 GMT
టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ ఉన్నారు కానీ.. పీపుల్స్ స్టార్ గా గుర్తింపు పొందిన ఆర్. నారాయణ మూర్తి మాత్రం సంథింగ్ కాదు ఎవ్రీథింగ్ డిఫరెంట్ అనాల్సిందే. హిట్లు కొట్టినా పెద్దగా సంపాదించేయాలని అనుకోలేదు.. సంపాదించిన దాన్ని దాచుకుని బిల్డింగులు కట్టేసుకోలేదు. సినిమానే జీవితం.. అదీ తను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా మాత్రమే సినిమా.. అనే స్టార్ నారాయణ మూర్తి తప్ప ఎవరూ కనిపించరేమో.

కమెడియన్లు కూడా కోట్ల విలువ చేసే కార్లు కొంటున్న రోజుల్లో.. ఈయనింకా ఆటోలోనే తిరుగుతూ ఉంటాడంటే.. ఎంత సింపుల్ మనిషో అర్ధమవుతుంది. రీసెంట్ గా బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోడీ.. పెద్ద నోట్లను రద్దు చేసి పారేశారు. డబ్బు విషయంలో తనకు ఎప్పుడూ వ్యామోహం లేదంటున్న నారాయణమూర్తి.. 'నా దగ్గర ఎందుకు డబ్బుల్లేవు? సూపర్ హిట్స్ తీసినా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు లేదు? కార్లు.. బంగ్లాలు.. మాన్షన్లు ఎందుకు లేవంటే.. నేను కాలేజ్ రోజుల నుంచి చాలా సింపుల్. అప్పట్లో రెండు జతల బట్టలు ఉండేవంతే. ఏనాడూ వాచ్ పెట్టాలి.. గోల్డ్ చైన్ వేసుకోవాలి లాంటివి అనుకోలేదు' అంటున్నాడు నారాయణ మూర్తి.

ఏపీ తెలంగాణల్లో ఎన్నో స్కూళ్లు.. ఆస్పత్రుల నిర్మాణాలకు.. నీరు లేని ప్రాంతంలో బోర్ వెల్స్ తవ్వకాలకు తను సంపాదించనంతా ఇచ్చేసిన ఈయనపై.. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. బహుశా ఇంత నిశ్చంతగా ఉన్న టాలీవుడ్ వ్యక్తి ఈయనొక్కడేనేమో అనుకుంటున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News