కొన్ని సినిమాల లెక్కలు అంతే. ఒక పట్టాన అర్థం కావు. ఒక చోట హిట్ అయితే మరో చోట ఫట్ అనటం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలకు ఇది బాగా అనుభవం. అతడు సినిమానే తీసుకుంటే కమర్షియల్ గా చెప్పుకునేంత ఘనంగా ఆడని ఈ మూవీ టీవీ లో మాత్రం దుమ్ము దులుపుతునే ఉంది. ఇప్పటికే కొన్ని వందల సార్లు టెలికాస్ట్ చేసినా మా ఛానల్ పదే పదే దీన్ని రెన్యువల్ చేసుకుంటూ నిర్మాత మురళీమోహన్ కు శాశ్వత ఆదాయవనరుగా మారింది. ఖలేజాది కూడా అదే పరిస్థితి. ఎప్పుడు వేసినా మినిమం టిఆర్పి రేటింగ్స్ దక్కుతున్నాయి. ఇక ఇలాంటి మరో సినిమా మహేష్ ఖాతాలో పడిపోయింది. అదే స్పైడర్. అదేంటి జీ తెలుగు లో వేసినప్పుడు రేటింగ్ రాలేదు కదా అనే అనుమానం మీకు రావొచ్చు. అక్కడే ఉంది తిరకాసు.
స్పైడర్ బొమ్మ హిట్ అయ్యింది తెలుగు టీవీలో కాదు అరవ ఛానల్ లో. ఇంతవరకు తమిళ్ వెర్షన్ లో తీసిన ఏ తెలుగు సినిమాకు రానంత భారీ స్థాయిలో 10.4 టిఆర్ పి రేటింగ్ తో స్పైడర్ ఏకంగా బాహుబలి 2నే క్రాస్ చేసి పారేసింది. ఇది చూసి అక్కడి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. తెలుగులో 7 కంటే తక్కువ రేటింగ్ తో శాటిలైట్ లో సైతం ఫ్లాప్ గా మిగిలిన స్పైడర్ ఆశ్చర్యకరంగా కోలీవుడ్ టీవీలో మాత్రం అంత రేటింగ్ తెచ్చుకోవడం విశేషమే. దానికి కారణం స్పైడర్ థియేట్రికల్ వెర్షన్ అక్కడి ప్రేక్షకులకు రీచ్ కాకపోవడమే అని విశ్లేషకుల అంచనా. మురుగదాస్ దర్శకత్వం, ఎస్ జే సూర్య విలనీ, మహేష్ గ్లామర్ అక్కడి ఆడియన్స్ ని దీని వైపు మళ్లేలా చేసుకున్నాయి.
మొత్తానికి ఏదైతేనేం తన సత్తా బుల్లితెరపై మరోసారి చాటాడు ప్రిన్స్. ఇక్కడ జీ తెలుగు సొంతం చేసుకున్న హక్కులను అక్కడ సన్ నెట్వర్క్ తీసుకుంది. ఊహించని రీతిలో ఇది రేటింగ్స్ దక్కించుకోవడంతో రిపీట్ టెలికాస్ట్ లో మంచి రాబడి ఇస్తుందని సన్ టీవీ ఖుషిలో ఉంది. దీని ప్రభావం భరత్ అనే నేనుపై కూడా ఉందట. అప్పుడే దీని హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందని టాక్.