ఎంతోకాలంగా ప్రేమించిన హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని షూటింగులకు కాస్త గ్యాస్ ఇచ్చిన నాగచైతన్య తిరిగి మేకప్ వేసుకుని కెమెరా ముందుకొచ్చాడు. ఈమధ్య కాలంలో తనకు డీసెంట్ హిట్ ఇచ్చిన ప్రేమమ్ ఫేం డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ప్రస్తుతం సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ టైం నుంచి అభిమానుల్లో బాగా ఆసక్తి పెంచింది.
సవ్యసాచి సినిమాలో తమిళ్ హీరో మాధవన్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఆమధ్య ఒకటీ.. అరా తెలుగు సినిమాలు చేసిన మాధవన్ ఇటీవల కాలంలో చేస్తున్న డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే. ఈ క్యారెక్టర్ కు డైరెక్టర్ చందు మొండేటి అతడిని ఏరికోరి తీసుకున్నాడు. ఇందులో మాధవన్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్ర అని టాక్. చైతన్య-మాధవన్ క్యారెక్టర్లు రెండింటినీ చాలా బలంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. వాళ్లిద్దరి మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగే పోరాటమే ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే అంశం అవుతుందని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఇందులో నాగ చైతన్య పాత్రకు కొన్ని ప్రత్యేక శక్తులు కూడా ఉంటాయని తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వస్తున్న సవ్యసాచి చిత్రంలో బాలీవుడ్ అందం నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. దీని తరవాత నాగచైతన్య మారుతి డైరెక్షన్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించి నటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది.