వీర రాఘవుడి హై లైట్ అదేనట!

Update: 2018-07-18 04:51 GMT
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మొదటిసారి రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ సాఫీగా జరిగిపోతోంది. దసరా రిలీజ్ ముందే ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే షూటింగ్ జరుగుతోంది. విడుదల ఇంతకు ముందు  అక్టోబర్ 18న అనుకున్నప్పటికీ కొద్ధి రోజుల క్రితమే రామ్ హలో గురు ప్రేమ కోసమేతో పాటు విశాల్ పందెం కోడి 2ని కూడా అదే డేట్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించేసారు. కాబట్టి వారం ముందుగానే అంటే అక్టోబర్ 11న జూనియర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఆగష్టు 15న ప్లాన్ చేసిన టీజర్ విడుదలలో ఈ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని ముందు నుంచి వినిపించడంతో పాటు ఫస్ట్ లుక్ లో సైతం చొక్కా లేకుండా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో  ఏదో భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉందనేలా క్లూ ఇవ్వడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా ఉండబోతోందట. ఈ మధ్య కాలంలో మాస్ ని ఉర్రూతలూగించే ఇలాంటి ట్రాక్ రాలేదని యూనిట్ సభ్యులు అఫ్ ది రికార్డు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ మాట వినగానే అలా సింహాద్రి గుర్తుకురావడం సహజం. అందులో కూడా సినిమా అంతా ఒక ఎత్తు అయితే కేరళ బ్యాక్ డ్రాప్ లో నడిపించే యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ అభిమానులు ఈలలు గోలలతో చొక్కాలు చించుకునేలా చేసింది.

అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ మాస్ పవర్ ని తనదైన స్టైల్ లో ఎలివేట్ చేస్తూ త్రివిక్రమ్ దీన్ని ప్లాన్ చేసినట్టు వినికిడి. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబందించిన షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. తెలిసిన మేరకు ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మొదలవుతుందని టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ స్వరాలు చాలా బాగా వచ్చాయని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ ఫాన్స్ ని  యమా ఊరిస్తోంది. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ సంగతి తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ మూడు నెలల  కాలం గడుస్తుందా అనే యాంగ్జైటీతో ఉన్నారు. వేచి ఉండక తప్పదు మరి.
Tags:    

Similar News