ట్యాక్సీవాలాలో అసలు హైలైట్ అదే..

Update: 2018-11-17 19:07 GMT
శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ట్యాక్సీవాలా’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ప్రతికూలతలు లేవని కాదు.. కానీ వాటితో పోలిస్తే సానుకూలతలే ఎక్కువ. ఇప్పటిదాకా తెలుగులో చూడని ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశాడు. అది ప్రేక్షకులకు బాగానే రుచిస్తోంది. ఐతే ఈ హార్రర్ థ్రిల్లర్ లో.. థ్రిల్ కంటే కూడా ఎంటర్ టైన్ మెంటే హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఇంత కామెడీ ఉంటుందని ప్రేక్షకులెవరూ ఊహించి ఉండరు. హార్రర్ కామెడీల పేరుతో రెగ్యులర్ కిచిడీ కామెడీ వడ్డించకుండా సిచువేషనల్ కామెడీతో మెప్పించారు. ఎక్కడా కామెడీ ఫోర్స్ డ్ గా అనిపించదు. సెపరేట్ ట్రాక్ లాగా లేదు కామెడీ.

కథలో భాగంగానే సందర్భానుసారం నవ్వులు పండించారు. ఇందులో మేజర్ క్రెడిట్ మధునందన్.. కొత్త కుర్రాడు విష్ణులకు దక్కుతుంది. ఇటు క్యారెక్టర్ రోల్స్.. అటు కామెడీ రోల్స్ తో మెప్పిస్తున్న మధునందన్.. కొంత విరామం తర్వాత తనదైన ముద్ర వేశాడు. ఈ చిత్రంలో అతను ఎఫర్ట్ లెస్ గా బాబాయ్ పాత్రను పోషించాడు. సహజమైన నటనతో.. మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మధు పాత్ర ఆద్యంతం వినోదం పంచింది. చాలా త్వరగా అతడి పాత్రకు అలవాటు పడిపోతాం సినిమాలో. మరోవైపు విజయ్ ఫ్రెండు అయిన కొత్త నటుడు విష్ణు కూడా మెప్పించాడు. తొలి సినిమా అయినా ఏ బెరుకూ లేకుండా నటించాడు. మధు-విష్ణుల కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. మొత్తంగా కామెడీ వర్కవుట్ కావడం ‘ట్యాక్సీవాలా’కు బాగానే కలిసొచ్చేలా ఉంది.
Tags:    

Similar News