మాల్ లో అంత అరాచకమా?

Update: 2018-01-05 12:57 GMT
హిందీలో బిగ్ బాస్ 11 హంగామా కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్ కు దగ్గరగా వచ్చిన ఈ ప్రోగ్రాం చుట్టూ చాలానే వివాదాలు చుట్టుముడుతున్నాయి. హాట్ కంటెస్టెంట్స్ అనుకున్న వారు ఫైనల్ వరకూ రాలేకపోవడమే ట్విస్ట్ అయితే.. ఆ తర్వాత కూడా అదే తీరు కంటిన్యూ అవుతోంది.

రీసెంట్ గా బిగ్ బాస్ 11కి లైవ్ పోల్ ఓటింగ్ లైన్స్ కట్ చేసేశారు. అయితే నిర్వాహకులు చేసిన  పనేంటంటే.. ఓ షాపింగ్ మాల్ కి పార్టిసిపెంట్స్ ను తీసుకెళ్లి.. అక్కడ లైవ్ ఓటింగ్ చేస్తామని ప్రకటించారు. కాకపోతే.. జనాల రద్దీ ఎక్కువగా ఉంటుదని ఎక్స్ పెక్ట్ చేయడంతో.. ఓ జైల్ మాదిరిగా ఇనుప ఊచలతో ఫ్రేమ్ ఏర్పాటు చేసి మధ్యలో కంటెస్టెంట్స్ ని ఉంచారు. అయితే.. అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో ఆడియన్స్ వచ్చేయడంతో.. వారిని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఏటేటా ఇలా చేస్తున్నా.. ఈసారి మాత్రం మరీ తొక్కిసలాట ఎక్కువైపోయింది.

పరిస్థితి చేజారి పోవడంతో పాటు.. బారికేడ్స్ ను దాటుకుని ఫ్యాన్స్ వచ్చేశారు. హీనా ఖాన్ ఫ్యాన్ ఒకరు.. ఆమెతో సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. ఆమెతో ఫోటో కోసం ట్రై చేస్తూ.. జుట్టు పట్టుకుని లాగేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. వికాస్ గుప్తా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు. పబ్లిక్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కానీ.. దీన్ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రచారానికి వాడేసుకుంటున్నారు.
Full View

Tags:    

Similar News