బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ - మృణాల్ ఠాకూర్ ప్రధా పాత్రల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''జెర్సీ''. తెలుగులో నాని హీరోగా నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ఇది హిందీ రీమేక్. కరోనా పాండమిక్ పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని చివర్లో డిసెంబరు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే చిత్ర బృందం గత కొన్ని రోజులుగా శరవేగంగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ మరియు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లు, స్పాలు, జిమ్ లు మొదలైన బహిరంగ ప్రదేశాలను మూసివేయడం ప్రారంభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధించింది. దీంతో నైట్ షోలకు అవకాశం లేకుండా పోయింది. అంతే కాకుండా మిగిలిన షోలను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా ఏరియాల్లో థియేటర్లు 50% ఆకుపెన్సీతోనే నడుస్తున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా ఢిల్లీ ప్రభుత్వం కూడా సినిమా హాళ్లు - మల్టీప్లెక్స్ లను క్లోజ్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఇలా దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కొత్త సినిమాల విడుదలలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'జెర్సీ' చిత్రాన్ని విడుదల చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించి.. నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. "ప్రస్తుత పరిస్థితులు మరియు కొత్త కోవిడ్ మార్గదర్శకాల దృష్ట్యా మేము మా 'జెర్సీ' సినిమా థియేట్రికల్ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. మేము మీ అందరి నుండి ఇప్పటివరకు అపారమైన ప్రేమను పొందాము. దీనికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దయచేసి సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండండి. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు" అని తెలిపారు.
బాలీవుడ్ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ కూడా ఇదే విషయాన్ని ట్విటర్ లో ధృవీకరించారు. 'జెర్సీ' సినిమా ఈ నెల 31న విడుదల కావడం లేదని.. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుందని తెలిపారు. కాగా, హిందీ 'జెర్సీ' చిత్రాన్ని అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు రూపొందించాయి.
అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. బన్నీ వాసు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన సినిమా కావడంతో తెలుగులోనూ 'జెర్సీ' సీనిమాపై అందరూ ఆసక్తి కనబరిచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - స్పెషల్ పోస్టర్స్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే అంశాలతో 'జెర్సీ' సినిమా రూపొందింది. సచేత్-పరంపర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.