'హిరణ్యకశిప'లో రానా చేయడం డౌటేనా?

Update: 2021-06-06 15:30 GMT
రానా కథానాయకుడిగా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'హిరణ్యకశిప' సినిమా చేయనున్నట్టు ఆ మధ్య గుణశేఖర్ చెప్పారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందనీ .. ఒక విజువల్ వండర్ గా ఈ సినిమా ఉంటుందని అన్నారు. దాంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఎదురుచూశారు. కానీ ఒక్కసారిగా గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాను ఎనౌన్స్ చేశారు. దాంతో 'హరణ్యకశిప' ప్రాజెక్టు సంగతి ఏమిటనే సందేహం అందరిలోను తలెత్తింది. ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ కి ఇదే ప్రశ్న ఎదురైంది.

అందుకు గుణశేఖర్ స్పందిస్తూ .. 'రుద్రమదేవి' తరువాత ఒక ఏడాది పాటు కూర్చుని నేను 'హిరణ్యకశిప' స్క్రిప్ట్ ను తయరుచేశాను. ఇంతవరకూ నేను రాసుకున్న స్క్రిప్ట్ లలో ఇది అల్టిమేట్ అని నాకు అనిపించింది. హిరణ్యకశిపుడి యాంగిల్ లో నేను తయారు చేసుకున్న ఈ కథ, నాకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా కోసం మూడేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాను. అంటే నాలుగేళ్ల కెరియర్ ను నేను దానిపై పెట్టాను. క్యాస్టింగ్ దగ్గర ఈ సినిమా ఆగింది. ఇప్పటికీ నేను ఈ సినిమాను మూడేనెలలో స్టార్ చేయగలను.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్న సమయంలో కరోనా ఎఫెక్ట్ పడింది. దానికి తోడు అదనంగా కొన్ని డ్రాబ్యాక్స్ ఎదురుకావడంతో హోల్డ్ లో పెట్టడం జరిగింది. 'శాకుంతలం' తరువాత నేను చేసే ప్రాజెక్ట్ 'హిరణ్యకశిప'నే. నాతో పాటు ఎవరువస్తే వాళ్లతోనే ఈ సినిమా చేస్తాను" అన్నారు. 'గతంలో ఎనౌన్స్ చేసినవారితోనే ఈ సినిమా ఉంటుందా?' అనే ప్రశ్నకి, "కొన్ని ప్రాజెక్టులు ఎవరిని తెచ్చుకోవాలో వారినే తెచ్చుకుంటాయి. నా నుంచి 'హిరణ్యకశిప' రావడం మాత్రం పక్కా" అని ఆయన సమాధానం ఇచ్చారు. దీనిని బట్టి చూస్తుంటే నిర్మాణం పరంగా, కథానాయకుడి పరంగా ఈ ప్రాజెక్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనే విషయం మాత్రం అర్థమవుతోంది


Tags:    

Similar News