టాలీవుడ్ ప్రముఖులపై ఆకస్మిక ఐటీ దాడులు ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో పలు బడా నిర్మాణ సంస్థలు.. అగ్ర నిర్మాతల పేర్లు సహా పలువురు హీరోల పేర్లు ప్రముఖంగా హైలైట్ అయ్యాయి. వెంకీ - నానీపైనా ఆదాయ పన్ను శాఖ అధికారుల విచారణ సాగడంపై పక్కాగా క్లారిటీ కూడా ఇచ్చాయి కొన్ని మీడియాలు. ఇక ఇందులో కింగ్ నాగార్జున ఇల్లు-కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు అంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. అందరు పేర్లతో పాటు తన పేరు కూడా గుంపులో గోవిందంలా వినిపించడం ఆశ్చర్యపరిచిందని నాగార్జున సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు.
ఇకపోతే జెర్సీ నిర్మాతలైన సితార ఎంటర్ టైన్ మెంట్స్.. ఆ బ్యానర్ హీరోగా పేరొచ్చిన నానీపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. డి.సురేష్ బాబు-రామానాయుడు స్టూడియోల్లోనూ సోదాలు సాగాయి. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు.. హార్డ్ డిస్కుల్ని ఐటీ అధికారులు స్వాధీన పరుచుకుని విచారిస్తున్నారని ప్రచారమైంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సోమవారం నేచురల్ స్టార్ నానీని ఐటీ అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సిందిగా నానీకి సమన్లు అందాయట. ఐటీ సోదాల్లో దొరికిన అనుమానాస్పద కాగితాలు.. చీటీలు.. ఇతరత్రా హార్డ్ డిస్కుల్లో దాగిన మర్మంపై ఐటీ కార్యాలయంలో విచారణ వుంటుందని తెలుస్తోంది. హీరో నానీని సోమవారం విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. నానీ సహా మిగిలిన వారికి కూడా ఇదే విధంగా సమన్లు అందనున్నాయట.
ఇక నేచురల్ స్టార్ నానీపై ఐటీ సోదాలు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. ఏడాదికి రెండు మూడు కమిట్ మెంట్లతో బిజీగా ఉంటున్న నానీపై ఈ విచారణ సాగడంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నానీకి క్లీన్ ఇమేజ్ ఉందని అభిమానులు అండగా నిలుస్తున్నారు. ఇక ఐటీ చెల్లింపులు సరిగా చేసినప్పుడు.. పత్రాలు- రసీదుల చిట్టీలు అన్నీ సరిగా ఉన్నప్పుడు ఎలాంటి విచారణలకు భయపడాల్సిన అవసరం ఉండదని పలువురు విశ్లేషిస్తున్నారు.