మరో పుష్పానికి మన హీరోయిన్ పేరు

Update: 2017-07-03 05:52 GMT
అందమైన అమ్మాయిలను పూలతో పూల్చడం పరిపాటి. ఎవరికి నచ్చిన పూలతో వారు అమ్మాయిలను పోల్చుకుంటూ ఉంటారు. రచయితలు అయితే.. మరింతగా బుర్రకు పదును పెట్టేసి అందాన్ని కూడా వర్ణించేస్తుంటారు. సన్నగా ఉంటే మల్లెతీగలా ఉంది.. బొద్దుగా ఉంటే బొండుమల్లెలా ఉంది.. నాజూగ్గా ఉంటే గులాబీ పువ్వులా ఉంది.. అంటూ తమ కవితా పటిమను చాటేస్తుంటారు.

అమ్మాయిలకు పుష్పాల పోలిక బాగా తెలిసిన విషయమే. అయితే.. ఐశ్వర్యారాయ్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయిపోయింది. పూలనే ఐష్ తో పోల్చాల్సిన పరిస్థితి వచ్చేంత అందం ఆమె సొంతం. ప్రపంచసుందరిగా గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయినా.. ఇప్పటికీ వన్నె తరగని అందం.. చెక్కి చెదరని ఖ్యాతి ఐష్ సొంతం. అందుకే అప్పట్లో ఆమె పేరును శాశ్వతం చేసేస్తూ నెదర్లాండ్ ప్రభుత్వం 2012లో ఓ అరుదైన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో పూచే టులిప్ పుష్పాలకు ఐశ్వర్య పేరు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ ఇది ఐశ్వర్యారాయ్ కు మాత్రమే దక్కిన అత్యంత అరుదైన గౌరవంగా చెప్పచ్చు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ ఘనతను సొంతం చేసుకుంటోందా?

ఒక అందగత్తెకు.. అందులోనూ భారతీయ అందానికి.. ఇలా విదేశీ ప్రభుత్వాలు గౌరవాన్ని ప్రకటించడం ఇప్పుడు మరోసారి జరగబోతోంది అంటున్నారు. అదే హాలాండ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రియాంక చోప్రా అండ్ దీపికా పదుకొనె పేర్లను పరిశీలీస్తోందట. ఏదో కొత్తరకం హైబ్రీడ్ పువ్వుకు వీరి పేరును పెట్టేస్తారని అంటున్నారు. ఇప్పుడు హాలీవుడ్ కూడా వెళ్లి పాపులర్ అయిన ప్రియాంక పేరును ఖచ్చితంగా ఏదో ఒక పువ్వుకు పెట్టాల్సిందే. ఆ డస్కీ సోయగాలు అటువంటివి మరి. చూద్దాం ఏమవుతుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News