ఇండియన్ సినిమాని హాలీవుడ్ సినిమా దొంగ దెబ్బ తీస్తోంది. ప్రతీ సారి మన మార్కెట్ ని దేశ వ్యాప్తంగా ప్రభావితం చేస్తోంది. మర్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ నిర్మాణ కంపనీల చిత్రాలకు భారతీయ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగా వాటిని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. దీంతో ప్రతీ సీజన్ లోనూ వీటి నుంచి మన సినిమాలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ కారణంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లని హాలీవుడ్ చిత్రాలతో షేర్ చేసుకోవాల్సి వస్తోంది.
తాజాగా విడుదలైన చిత్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `పుష్ప : ది రైజ్`. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించిన తొలి పార్ట్ ని రిలీజ్ చేశారు. ఇదే సమయంలో హాలీవుడ్ క్రేజీ మూవీ `స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్` వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించడమే కాకుండా భారతీయ చిత్రాల మార్కెట్ ని కూడా ప్రభావితం చేస్తోంది.
భారతీయ చిత్రాల మార్కెట్ ని దెబ్బతీస్తున్న ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రు. 37. 67 కోట్లు వసూలు చేసింది. ఇది భారతీయ బాక్సాఫీస్ వద్ద ఓ డబ్బింగ్ సినిమా 2021లో తొలి రోజు సాధించిన అతి భారీ ఓపెనింగ్ మొత్తంగా చెబుతున్నారు. హాలీవుడ్ క్రేజీ చిత్రాల నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన మూడవ చిత్రమిది.
ఇదే ఏడాది వచ్చిన `షాంగ్ - చీ` ఎటర్నల్స్ దేశ వ్యాప్తంగా తొలి రోజు రూ. 3.25 కోట్లు, రూ. 8.75 కోట్లు వసూళ్లని రాబట్టాయి. ఈ సినిమాల సమయంలో విడుదలైన `సూర్యవంశీ` మొదటి రోజు రూ. 26.29 కోట్లను రాబట్టింది. గడిచిన రోజులని.. ఇంత వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన సినిమాలని పరిశీలించి చూస్తూ హాలీవుడ్ చిత్రాలు సైలెంట్ గా మన ఇండియన్ సినిమాకి మొగుళ్లుగా మారుతున్నట్టుగానే కనిపిస్తోంది. మరి ఈ దాడి నుంచి మన భారతీయ సినిమాని కాపాడాలంటే డబ్బింగ్ చిత్రాలని కొంత వరకు కట్టడి చేయాల్సిందే అంటున్నారు మన సినీ ప్రియులు.. లేదంటే మన సినిమాల రిలీజ్ ల సమయంలో వాటిని రిలీజ్ చేయకుండా వాయిదా వేయాలని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.