మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు భయపెట్టేసేందుకు రెడీ అవుతోంది. అభినేత్రి అనే చిత్రంతో మూడు భాషల ఆడియన్స్ లో వణికిస్తానంటోంది. తమ్మూతో పాటు ప్రభుదేవాను కూడా తీసుకొచ్చాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఇప్పుడీ సినిమా స్క్రిప్ట్ వర్క్ సంబంధించి.. ఓ హాలీవుడ్ రైటర్ కూడా జత కావడం హాట్ టాపిక్ అయింది.
హాలీవుడ్ యాక్టర్ కీన్ రీవ్స్ కి సవతి తండ్రి పాల్ ఆరోన్. పలు అవార్డ్ చిత్రాలకు వర్క్ చేసిన అనుభవం పాల్ కు ఉంది. ఈయనతో పరిచయంపై ఇంట్రెస్టింగ్ సంగతులు చెబుతున్నాడు దర్శకుడు విజయ్. 'శైవం(తెలుగులో దాగుడుమూత దండాకోర్ గా రీమేక్ అయింది) చిత్రానికి గాను సౌండ్ మిక్సింగ్ సమయంలో ఈయనను కలిశాను. శైవంను పూర్తిగా చూశారు పాల్. ఆ తర్వాత కూడా కొన్ని ఐడియాలను పంచుకున్నాం. ఒక ఆలోచన దగ్గర ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. ఇద్దరం కలిసి వర్క్ చేయాలని అనుకున్నాం. అలా అభినేత్రి కోసం ఈ హాలీవుడ్ రైటర్ బోర్డ్ లోకి వచ్చాడు' అని చెప్పాడు విజయ్.
మార్చ్ నెలలో ఓ సారి ఇండియాకి వచ్చిన పాల్ ఆరోన్.. సినిమా తెరకెక్కుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడట. ఇదిలా ఉంటే.. మిల్కీ మూవీ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తుండడం విశేషం. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ల నుంచి ఒక్కో సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారని చెబుతున్నాడు డైరెక్టర్.