మెగా ఫ్యాన్స్ లో మళ్లీ 'ఆటోజానీ' ఆశలు చిగురిస్తున్నాయా? మెగాస్టార్-పూరి ఆ దిశగా అడుగులు వేయడానికి ఛాన్స్ ఉందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. ఇటీవలి కాలంలో చిరు-పూరి ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారో చూస్తునే ఉన్నాం. ముంబైలో 'గాడ్ ఫాదర్' సెట్ లో పూరి అండ్ కో చిరంజీవిని కలవడం..అటుపై అదే సినిమాలో పూరి గెస్ట్ పాత్ర పోషించడం... ఇప్పుడు 'లైగర్' ప్రచారానికి చిరంజీవి సహకరించడం వంటి సన్నివేశాలు ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ ని మరోసారి హైలైట్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే చిరు మరోసారి 'ఆటోజానీ' కి రిపేర్లు పూర్తిచేసి మళ్లీ ఫ్రెష్ గా కథ వినిపించినట్లు వెలుగులోకి వస్తుంది. 'లైగర్' ప్రచారం సహా పూరి- చిరుతో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డట్లు ఇన్ సైడ్ జోరుగా టాక్ వినిపిస్తుంది. ఈ సన్నివేశాలన్ని మెగా అభిమానుల్లో 'ఆటోజానీ'కి ఆశలు చిగురించేలా చేసాయి. ప్రస్తుతం ఆటోజానీ మ్యాటర్ ఇండస్ర్టీ సహా అభిమానుల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవానికి చిరంజీవి ల్యాండ్ మార్క్ చిత్రం 150 కి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాల్సిన సంగతి తెలిసిందే. ముందుగా చిరు-పూరితోనే చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆటోజానీ కథ సిద్దం చేయడం ఫస్ట్ హాఫ్ నచ్చడం..సెకెండ్ హాఫ్ లో మార్పలు చేర్పులు చేయడం అంతా పాత విషయమే.
అయితే ఆ మార్పులు కారణంగా పూరి హర్ట్ అయ్యారని..దీంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కనబెడేసినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అటుపై చిరు- సురేందర్ రెడ్డి తో 'సైరా నరసింహారెడ్డి' చేయడం జరిగింది. అయితే అదే సమయంలో పూరి ఎప్పటికైనా చిరుతో సినిమా చేస్తానని ప్రామిస్ సైతం చేసారు. 150 కాకపోతే..151..అదీ కుదరకపోతే 153 అన్నారు.
అలా ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్న కోరికను ఏదో ఒక రోజు నెరవేర్చుకుంటానని ధీమా వ్యక్తం చేసారు. అయితే ఆ ఘటన తర్వాత మళ్లీ పూరి చిరుని కలిసింది లేదు. ఎవరి ప్రాజెక్ట్ ల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే తాజా సన్నివేశాల నేపథ్యంలో ఆ కాంబోకి సమయం దగ్గరపడినట్లు కనిపిస్తుంది. ఇద్దరు రెగ్యులర్ గా టచ్ లో ఉండటం సహా..ఒకరికొకరు సహకరించుకుంటోన్న విధానం తో అందరూ ఆటోజానీపై మనసు మళ్లించారు.
ఇక ఇండస్ర్టీలో పూరి సక్సెస్ ఫుల్ ట్రాక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పరిశ్రమకి ఎంతో మంది స్టార్లని అందించారు. వార సుల్ని సైతం స్టార్లగా తీర్చి దిద్దిన ఘనత పూరి సొంతం. చిరంజీవి తనయడు రామ్ చరణ్ ని 'చిరుత'తో లాంచ్ చేసింది పూరినే. తొలి సినిమాతోనే చరణ్ ని కమర్శియల్ స్టార్ గా లాంచ్ చేసాడు. కేవలం పూరి పై నమ్మకంతో చిరు తనయుడిని తన చేతుల్లో పెట్టారు. ఇప్పుడు చిరుతోనే పనిచేయడానికి పూరి సమాయత్తం అవుతున్నారు. మరి ఆ ఛాన్స్ దగ్గర్లోనే ఉందా? లఏదా? అన్నది తెలియాలి.