ఇకపై అలాంటి సినిమాలు మాత్రమే చేస్తానంటున్న హాట్ బ్యూటీ..!

Update: 2021-01-16 00:30 GMT
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే బిగ్ స్క్రీన్ పై కంటే స్మాల్ స్క్రీన్ పైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా నటించిన రాధిక ఆప్టే.. డిజిటల్ వరల్డ్ లో సత్తా చాటుతోంది. తెలుగులో 'రక్తచరిత్ర' 'ధోని' 'రక్తచరిత్ర 2' 'లెజెండ్' 'లయన్' 'కబాలి' వంటి సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ప్రస్తుతం ఒరిజినల్ సినిమాలు - వెబ్ సిరీస్‌ లతో బిజీగా మారింది. ఈ క్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ వారు రాధికా ఆప్టే ను ''క్వీన్ ఆఫ్ ఓటీటీ''గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. కరోనా లాక్‌ డౌన్ సమయంలో తనను తాను బాగా అర్థం చేసుకున్నానని.. అందుకే సినిమాల ఎంపిక విషయంలో రియలైజ్ అయ్యానని చెప్పుకొచ్చింది.

రాధిక ఆప్టే మాట్లాడుతూ.. చాలా సార్లు ప్రాజెక్ట్ మిస్ అవుతుందనే భయంతో ఇన్‌సెక్యూరిటీతో కొన్ని సినిమాలు చేస్తానని తెలిపింది. అలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అయినా కాకపోయినా సంతృప్తి మాత్రం ఉండదని చెప్పింది. అందుకే ఫ్యూచర్‌ లో నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెప్తానని.. నచ్చకపోతే కచ్చితంగా నో చెప్పాలని నిర్ణయించుకున్నానని ఆప్టే వివరించింది. ఇతరులను చూసి బిజీగా ఉన్నారని.. వాళ్లు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా అని స్ట్రెస్‌ లో పడకూడదని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ లో తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేస్తున్నానని రాధికా ఆప్టే తెలిపింది.
Tags:    

Similar News