కోవిడ్ నేపథ్యంలో జక్కన్న ప్లాన్స్ ఎలా ఉంటాయో..!

Update: 2021-05-01 12:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో 'కొమురం భీమ్' గా తారక్ నటిస్తుండగా.. 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా రామరాజు అవతారాన్ని చూపించి సర్ప్రైజ్ చేశారు. అలానే అజయ్ దేవగన్ పుట్టినరోజుకి ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ పోస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కోవిడ్ సమయంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ రుధిరం చూపించబోతున్నారా లేదా అనే చర్చ జరుగుతోంది. గతేడాది తారక్ బర్త్ డే నాడు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ వస్తుందని భావించగా.. కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు ఈ ఏడాది పుట్టినరోజుకి సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భీమ్ లుక్ ఎలా ఉంటుందనేది పక్కనపెట్టి, అసలు మే 20న అప్డేట్ ఉంటుందా లేదా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మరి జక్కన్న ఏమి చేస్తాడో చూడాలి. కాగా, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాన్ని డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్ - ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Tags:    

Similar News