ఫోటో షూట్: ఊర్ఫీ ఫ్యాష‌న్ పిచ్చి ప‌రాకాష్ట‌కు..!

కొత్త‌క వింత పాతొక రోత‌! ఇక్క‌డ ఎప్పుడూ ఏదో ఒక కొత్త‌ద‌నం కావాలి. అందుకే అనునిత్యం శోధ‌కులు ఏదో ఒక కొత్త‌ద‌నం సృష్టించాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు

Update: 2024-09-29 03:30 GMT

కొత్త‌క వింత పాతొక రోత‌! ఇక్క‌డ ఎప్పుడూ ఏదో ఒక కొత్త‌ద‌నం కావాలి. అందుకే అనునిత్యం శోధ‌కులు ఏదో ఒక కొత్త‌ద‌నం సృష్టించాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఇది త‌ప్ప‌నిస‌రి. ఇక యువ ఫ్యాష‌నిస్టా ఊర్ఫీ జావేద్ నిరంత‌రం ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తూ అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంది.

ఊర్ఫీ బోల్డ్ ఫ్యాష‌న్ సెన్స్ కి భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. త‌ను ఏం చేసినా ప్ర‌పంచం అటు తిరిగి చూస్తోంది. టాలీవుడ్ క్వీన్ ఫ్యాష‌నిస్టా స‌మంత సైతం ఊర్ఫీ ఫ్యాష‌న్ సెన్స్ కి ఫిదా అయిపోయిందంటే అర్థం చేసుకోవాలి. ఊర్ఫీ శైలిపై తీవ్ర‌మైన కామెంట్లు ఎన్ని ఉన్నా త‌న ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంసించే సెల‌బ్రిటీల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇది నిజంగా ఈ యువ ప్ర‌తిభావ‌ని స‌క్సెస్ అని భావించాలి.

నా కోసం ప్రతిదీ మార్చిన షూట్! అంటూ ఇప్పుడు ఊర్ఫీ కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసింది. `ది డ‌ర్టీ` మ్యాగ‌జైన్ కోసం స్పెష‌ల్ ఫోటోషూట్ ఇద‌ని తెలిపింది. నేను పెద్ద డిజైనర్లు అనితా ష్రాఫ్ అద‌జానియాతో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. దీని తర్వాత ప్రజలు నన్ను వేరే కోణంలో చూడటం ప్రారంభించారు. ఇలా చేసినందుకు క్షితిజ్ క‌న‌క‌రియా, అనురాగ్ శ‌ర్మ‌ల‌కు ధన్యవాదాలు. నేను ప్రేమిస్తున్నానని మీ ఇద్దరికీ తెలుసు!! మీ దృష్టి -సృజనాత్మకత సాటిలేనిది !! ఎప్పటికీ రుణపడి ఉంటాను... అని రాసింది.

ఊర్ఫీ ఈసారి కూడా య‌థావిథిగా బోల్డ్ ఫోటోషూట్ తో చెల‌రేగింది. ర‌క‌ర‌కాల వెస్ట్ర‌న్ స్టైల్స్ ని అనుక‌రిస్తూ, రంగుల అద్దిన ప్ర‌త్యేక‌మైన హెయిర్ క‌ట్ తో పాశ్చాత్య ధోర‌ణితో రెచ్చిపోయింది. ఐదారు వెరైటీ డిజైన‌ర్ లుక్స్ లో అద‌ర‌గొట్టింది ఊర్ఫీ. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News