వెట్రిమారన్ 'విడుదల పార్ట్ 1' ఎలా ఉంది అంటే ?

Update: 2023-04-15 15:25 GMT
ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. తాను ఎంచుకున్న కథను తెరకెక్కించే విధానంలో ఎంతో డెప్త్ గా సన్నివేశాలు రాసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు కొందరు దర్శకులు. సమాజంలో ఉన్న కొన్ని అంశాల మీద సీరియస్ గానే సినిమాలు చేస్తూ ఉంటారు కొందరు. అయితే అలాంటి వారిలో తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఒకడు. ఆయన చేసిన సినిమాలను చూస్తే అతని పనితనం ఏంటో అర్థమవుతుంది. సమాజంలో ఉన్న అసమానతల మీద వెట్రిమారన్ మార్క్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి.

ఎంచుకున్న కథను పూర్తిస్థాయిలో లోతుల్లోకి వెళ్లి తెరకెక్కించడం వెట్రిమారన్ స్టైల్. లేటెస్ట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా విడుదల పార్ట్ 1. కమెడియన్ సూరిని ప్రధాన పాత్రధారిగా వెట్రిమారన్ ఓ పెద్ద సాహసమే చేశారని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కమెడియన్ గా కనిపించిన సూరి వెట్రిమారన్ సినిమాలో సీరియస్ పాత్రలో అలరించాడు. ఇక సినిమాలో విజయ్ సేతుపతి కనిపించేది తక్కువ నిడివే అయినా ఆయన వచ్చినప్పుడు సినిమాకు సూపర్ హై వస్తుంది.

ఇలాంటి సినిమాలు కేవలం వెట్రిమారన్ మాత్రమే చేయగలడు అనేలా తన మార్క్ చాటుకున్నాడు డైరెక్టర్. వెండితెర మీద సహజత్వాన్ని చూపించడం అనేది అందరి వల్ల కాదు వెట్రిమారన్ మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటాడు. విడుదల పార్ట్ 1 వెట్రిమారన్ తన కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికే పాత్రల స్వభావాలు, పరిస్థితులతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు.

రీసెంట్ గా తమిళ్ లో రిలీజై సక్సెస్ అయిన విడుదలై పార్ట్ 1 తెలుగులో విడుదలగా అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే దానికి కచ్చితంగా ఒక రేంజ్ ఉన్నట్టే. విడుదల పార్ట్ 1 ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కి కావాల్సిన స్టఫ్ ఇచ్చేశాడు డైరెక్టర్ వెట్రిమారన్.

సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎదురుచూసేలా పార్ట్ 1 క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయి. ఫైనల్ గా శుక్రవారం రిలీజైన శాకుంతలం స్ట్రైట్ తెలుగు సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా లారెన్స్ రుద్రుడు కూడా రొటీన్ మాస్ సినిమాగా టాక్ తెచ్చుకుంది. మరి విడుదల టాక్ బాగానే ఉండగా సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకునేలా ఉంది.

Similar News