టాలీవుడ్ నచ్చలేదా అమ్మడు..?

ప్రేమ కథలతో అక్కడ యువతని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ గా చేసుకుంది.

Update: 2025-01-01 02:30 GMT

మలయాళ భామలు చాలా సహజంగా నటిస్తారు. అందుకే వారి అభినయం మన ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈమధ్య మలయాళంలో యూత్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డ కథానాయిక మమితా బైజు. ప్రేమ కథలతో అక్కడ యువతని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ గా చేసుకుంది. ప్రేమలు అలా రిలీజ్ అవ్వగానే వెంటనే తమిళ్ లో ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ లో రెబల్ సినిమా చేసిన మమితా బైజు హర్ అనే ఆంథాలజీలో నటించింది.


ఇక ప్రస్తుతం దళపతి విజయ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మమితా విష్ణు విశాల్ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో తమిళ్ లో తన హవా కొనసాగించాలని చూస్తుంది. ఐతే మలయాళంలో ఇలా పాపులర్ అవగానే కోలీవుడ్ లో వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఐతే ఇప్పటివరకు మమితా తెలుగు ఆఫర్ల గురించి ఒక్క న్యూస్ బయటకు రాలేదు. ఆమె దగ్గరకు అసలు కథలు రాలేదా లేదా అమ్మడే వాటిని రిజెక్ట్ చేసిందా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రేమలు సినిమాకు ముందు ఏడేళ్లుగా ప్రాజెక్ట్ లు చేస్తున్నా కూడా అమ్మడికి ఈ సినిమాతోనే క్రేజ్ వచ్చింది. ఐతే ప్రేమలు సూపర్ క్లిక్ అయినా కూడా అమ్మడికి టాలీవుడ్ నుంచి సరైన అవకాశాలు రాలేదని తెలుస్తుంది. ప్రేమలు సినిమాలో మమితా బైజు క్యూట్ లుక్స్ కి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. తెలుగులో ఎక్కువగా కమర్షియల్ ఆఫర్లే ఉంటాయి. కథాబలం ఉన్న సినిమాలే చేసేలా అమ్మడి కెరీర్ ప్లాన్ చేస్తుంది.

ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్న మమితా మరోపక్క ప్రేమలు 2 సినిమాలో కూడా నటిస్తుంది. రాబోతున్న సినిమాలతో అమ్మడు తన క్రేజ్ ని పెంచుకోవాలని చూస్తుంది. తప్పకుండా సౌత్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ గా మమితా తన టాలెంట్ చూపిస్తుంది. మరి తెలుగు ఎంట్రీ ఎప్పుడన్నది తెలియదు కానీ అప్పటివరకు ఆమె చేసిన సినిమాలు డబ్బింగ్ వెర్షన్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మమితా తెలుగు ఫ్యాన్స్ కి ఇలా ఇబ్బందికరమే అయినా అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం వారు ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఆల్రెడీ సౌత్ అంతా ఆమె పాపులర్ అవగా ఇక వరుస హిట్లు పడ్డాయంటే టాప్ లీగ్ లోకి వచ్చినట్టే లెక్క.

Tags:    

Similar News