కమ్ముల కూడా ఇంత ఆలస్యం చేస్తే ఎలా?

ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తోన్న ‘కుబేరా’ మూవీని నిజానికి 2024 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి.

Update: 2025-01-03 21:30 GMT

ఫీల్ గుడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అంటే టాలీవుడ్ లో వినిపించే పేరు శేఖర్ కమ్ముల. అతను ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేరా’ మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ జోనర్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమాలకి భిన్నంగా ఈ మూవీ కథ ఉండబోతోందని ఇప్పటికే వచ్చిన టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు.

ధనుష్ పాత్ర ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. అలాగే కింగ్ నాగార్జున ఒక రిచ్ మెన్ గా కనిపించబోతున్నారు. రష్మిక ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది. శేఖర్ కమ్ముల సినిమాలలో కథల కంటే క్యారెక్టర్స్ జర్నీ ఉంటుంది. అలాగే చుట్టూ జరిగే సంఘటనలపై వారు ఎలా రియాక్ట్ అయ్యారనే ఎలిమెంట్స్ ని తెరపై ఎమోషనల్ గా ఆవిష్కరిస్తారు.

అందుకే శేఖర్ కమ్ముల మూవీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తోన్న ‘కుబేరా’ మూవీని నిజానికి 2024 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో 2025కి వాయిదా వేశారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారంట. కాని ఇప్పుడు ఈ టైంలో వచ్చే ఛాన్స్ లేదనే టాక్ నడుస్తోంది.

లేటెస్ట్ గా జూన్ కి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. షూటింగ్ కూడా ఇంకా ఫినిష్ కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి సినిమాని వాయిదా వేసారనే మాట వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాల విషయంలో ఎక్కువ వాయిదా వేసిన సందర్బాలు లేవు. మేగ్జిమమ్ చెప్పిన సమయానికి సినిమాని రిలీజ్ చేసేవారు.

అయితే ‘కుబేరా’ మూవీని కంప్లీట్ గా ఆయన జోన్ నుంచి బయటకొచ్చి చేస్తున్నారు. దాంతో పాటు ఈ సినిమాకి 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై శేఖర్ కమ్ముల ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నాడని అనుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

అయితే శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు కూడా మూవీ రిలీజ్ ని ఇంత ఆలస్యం చేస్తే ఎలా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కొట్టాలని శేఖర్ కమ్ముల చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ ఆలస్యం అయిన బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి వాయిదా వేసి ఉంటారని అనుకుంటున్నారు.

Tags:    

Similar News