2025 లో న‌మ్ర‌త సోలోగానే ప్లైట్ ఎక్కాలా?

ఒక్క‌సారి 2024 పాత ఏడాదిలోకి వెళ్తే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి బెస్ట్ ఇయ‌ర్ గా భావిస్తున్నారు.

Update: 2025-01-03 17:05 GMT

పాత జ్ఞాప‌కాలకు బైబై చెప్పి కొత్త జ్ఞాపకాల‌కు అంతా స్వాగ‌తం ప‌ల‌క‌డానికి రెడీగా ఉన్నారు. 2025లో ఎలాంటి మెమోరీస్ ఉంటాయా? అని సెల‌బ్రిటీలంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి కొత్త ఏడాదిని ఎవ‌రెలా ముగిస్తారు? అన్న‌ది 2025 డిసెంబ‌ర్ లో మాట్లాడుకుందాం. ఒక్క‌సారి 2024 పాత ఏడాదిలోకి వెళ్తే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి బెస్ట్ ఇయ‌ర్ గా భావిస్తున్నారు. 2024లో ఎన్నో అంద‌మైన న‌గ‌రాల్ని చుట్టేసి వ‌చ్చేసారు.


ఒక్క‌సారిగా న‌మ్ర‌త ఇన్ స్టా గ్రామ్ లో ఆ జ్ఞాప‌కాలు పంచుకుంటూ వావ్ అనేసారు. నమ్రత 2024 ట్రావెల్ డైరీలో లండన్, పోర్టోఫినో, మొనాకో, జైపూర్, మాల్దీవులు, న్యూయార్క్ సిటీ, దుబాయ్, బ్యాంకాక్, జెనీవా, సెయింట్ మోరిట్జ్, బాడెన్-బాడెన్ , ముంబై ఇలా అంద‌మైన ప్ర‌ఖ్యాత న‌గ‌రాలెన్నో ఉన్నాయి. గ‌త ఏడాది ప్ర‌తీ ప్రాంతాన్ని ఆమె సంద‌ర్శిం చారు. `365 రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు ఇవి అంటూ రాసుకొచ్చారు.


మ‌రి 2025లో ఇంకెన్నా న‌గ‌రాలు చుట్టేస్తారో చూడాలి. అయితే ఇక్క‌డో బ్యాడ్ న్యూస్ ఏంటి? అంటే 2025 లో న‌మ్రత సింగిల్ గా పిల్ల‌ల‌తో మాత్ర‌మే వెకేష‌న్ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుందేమో. ఎందుకంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ రాజ‌మౌళి సినిమా షూటింగ్ లో ఉంటారు. ఆయ‌న‌తో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మొద‌లైన నాటి నుంచి ముగించే వ‌ర‌కూ ఆయ‌న అనుమ‌తి లేనిదే బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీలుండ‌దు.


అనుమ‌తి ల‌భించ‌డం క‌ష్ట‌మే. దాదాపు ఏడాదిన్నర పాటు ఆ ప్రాజెక్ట్ షూటింగ్ ద‌శ‌లో ఉంటుంది. మ‌ధ్య‌లో విరామం దొరికినా హీరో ప్రాజెక్ట్ కి సంబంధించిన వేర్వేరు ప‌నుల్లోనే నిమ‌గ్న‌మ‌వ్వాల్సి ఉంటుంది. వెకేష‌న్ల‌కు వెళ్తాను? విదేశాల‌కు తిరుగుతానంటే ఆయ‌న ఒప్పుకునే డైరెక్ట‌ర్ కాదు. డైరెక్ట‌ర్ షూటింగ్ కి లాంగ్ లీవ్ ప్ర‌క‌టిస్తే త‌ప్ప మ‌హేష్ ఫ్యామిలీతో జ‌త క‌ల‌వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌దు.


Tags:    

Similar News