శ్రీలీల.. అక్కడ బిగ్గెస్ట్ ఎంట్రీ ఇస్తోందిగా!

ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో కానీ.. వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు సొంతం చేసుకుని లక్కీ గర్ల్ గా మారిపోయిందనే చెప్పాలి.

Update: 2025-01-03 20:30 GMT

యంగ్ బ్యూటీ శ్రీలీల.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన అమ్మడు.. పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో కానీ.. వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు సొంతం చేసుకుని లక్కీ గర్ల్ గా మారిపోయిందనే చెప్పాలి.

మాస్ మహారాజా రవితేజ ధమాకా, నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరితో మంచి హిట్స్ అందుకున్న తర్వాత ఆమె నటించిన వరుస సినిమాలు నిరాశపరిచాయి. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అమ్మడు.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలతో బిజీగా మారింది. గత సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. శ్రీలీలను తీసుకోవడానికి మేకర్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పాలి.

రీసెంట్ గా పుష్ప-2 ది రూల్ మూవీలో అల్లు అర్జున్ సరసన కిస్సిక్ సాంగ్ లో చిందులేసిన శ్రీలీల.. ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంది. గ్లామర్ స్టెప్పులేసి ప్రేక్షకులను, కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పుడు తెలుగులో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో నటిస్తున్న ఆమె చేతిలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది.

దాంతోపాటు హీరో శివ కార్తికేయన్ తో మూవీ చేస్తున్న శ్రీలీల.. త్వరలో కోలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కిస్తున్న మూవీలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆ మధ్య రానా టాక్ షోకు వచ్చినప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది శ్రీలీల. అయితే బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఆమె బీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వరుస హిట్స్ అందుకుని కార్తీక్ ఆర్యన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆయన హీరోగా తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సమీర్‌ విద్వాన్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మొత్తానికి యంగ్ బ్యూటీ.. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    

Similar News