సీనియర్ స్టార్స్.. ఇంకా ఎన్నాళ్ళీలా?

Update: 2023-01-21 07:30 GMT
చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరికి కథల ఎంపిక విషయంలో ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. వారి బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే విధంగా, అలాగే వారి ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని కొంత మంది కథలని ఎంపిక చేసుకుంటారు. ప్రేక్షకులని దృష్టిలో ఉంచి ఆడియన్స్ తనని ఎచూడాలని అనుకుంటున్నారో అలాంటి కథలని ఎంపిక చేసుకుంటారు. అలాగే మరికొందరు ప్రస్తుతం హిట్ సినిమాల ప్యాట్రన్ చూస్తూ వాటిని ఫాలో అవుతూ ఉంటారు.

తమ కథలని కూడా అదే జోనర్ లో ఉండేలా చూసుకుంటారు. కొంత మంది అయితే కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రయోగాలు చేయడానికి పెద్ద పీట వేస్తారు. మరికొంత మంది ప్రేమకథలని మాత్రమే ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తారు. ఇలా హీరోలుగా ఉన్నవారి ఆలోచన సరళి కథల ఎంపికలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇక టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కథల ఎంపిక కూడా ప్రస్తుతం చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. వారి ఏజ్ ని సెట్ అయ్యే విధంగానే కథలని కూడా ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో కమర్షియల్ ఫార్ములా కథలకి పెద్ద పీట వేస్తున్నాడు. అవి రీమేక్ లు అయినా పర్లేదు. కమర్షియల్ ఫార్మాట్ లో ఉండి తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతాయి అనుకుంటే చేయడానికి ఒకే చెప్పేస్తున్నారు. ఇక బాలకృష్ణ కథల ఎంపిక చూసుకుంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, పవర్ ఫుల్  యాక్షన్ ఎలిమెంట్స్, అవుట్ అఫ్ లా అనే విధంగా ఉండే కథలని ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. సింహ నుంచి అతని కథల విధానం చూసుకుంటే చాలా వరకు అలాగే ఉన్నాయి.

ఇక నాగార్జున అయితే రొమాంటిక్ కథలని పూర్తిగా పక్కన పెట్టి స్పై, పోలీస్ ఆఫీసర్, ఇంటలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు గత కొన్ని సినిమాల నుంచి చూస్తూ ఉంటే కనిపిస్తుంది. ఇక విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. సోలోగా అయితే రీమేక్ స్టొరీలలో తనకి సరిపోయే వాటిని సెలక్ట్ చేసుకొని చేస్తున్నాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ కథలని కూడా ట్రై చేస్తున్నాడు. ఇలా సీనియర్ స్టార్ హీరోలు కథల విధానం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత మారిందని చెప్పాలి. మరి ఇదే ఫార్ములాతో వారు కొనసాగుతారా లేదంటే మళ్ళీ డిఫరెంట్ కథలని ట్రై చేస్తారా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News