దశాబ్ధం పైగానే టాలీవుడ్ - కోలీవుడ్ లో కథానాయికగా కొనసాగింది హన్సిక మోత్వానీ. కానీ ఎందుకనో స్టార్ హీరోయన్ కేటగిరీలో చేరలేకపోయింది. కనీసం హిందీ పరిశ్రమలో అయినా స్టార్ అవుతుందని అనుకుంటే అక్కడ కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఆ క్రమంలోనే తమిళ పరిశ్రమలో స్నేహాల్ని మెయింటెయిన్ చేస్తూ కెరీర్ బండిని నెట్టుకొస్తోంది.
ప్రస్తుతం కెరీర్ ఆశించినంత స్పీడ్ గా అయితే లేదు. అయినా ఈ అమ్మడికి అదిరిపోయే లగ్జరీ కార్ కానుకగా అందింది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కార్ తన గ్యారేజ్ లో చేరింది. ఈ దీపావళి కానుకగా మామ్ మోనా మోత్వానీ కూతురిపై ప్రేమతో ఈ ఖరీదైన కార్ ని కానుకగా ఇచ్చిందట. ఈ కార్ ఖరీదు వింటే నోరెళ్లబెట్టాల్సిందే. దాదాపు రూ.12కోట్లు వెచ్చించి ఇంత ఖరీదైన కార్ ని కూతురికి కానుకగా ఇచ్చిందా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రేమకు అనుబంధానికి ఖరీదుతో పనేం ఉంది! అని సరిపెట్టుకోవాలి.
అయితే ఇలాంటి కార్లు కొనే అర్హత మెగాస్టార్ చిరంజీవి- రెబల్ స్టార్ ప్రభాస్- మోహన్ బాబు- నాగార్జున- సుబ్బరామి రెడ్డి వంటి గొప్ప గొప్ప వాళ్లకే ఉంటుంది. ఫోర్బ్స్ జాబితాలో టాప్ బ్యూటీస్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా- ఐశ్వర్యారాయ్- సల్మాన్ ఖాన్ వంటి స్టార్ రేంజ్ వాళ్లే ఈ తరహా కార్లను వాడుతున్నారు. అయితే ఇంత సాహసించి ఆ రేంజులో పెట్టుబడి పెట్టింది హన్సిక మామ్. కన్న ప్రేమ అంతే మరి!