టాప్ 5 వరకు వచ్చిన సిరి దక్కించుకున్నది ఎంత?

Update: 2021-12-20 05:17 GMT
తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 5 లో లేడీ ఫైటర్ గా సిరికి గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు. సిరి ప్రతి టాస్క్ లో కూడా తన బెస్ట్‌ ఇచ్చేది. ఫిజికల్ గా ఆమె ఎంత కష్టపడిందో ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చెప్పకనే చెప్తాయి. ముఖ్యంగా ఐస్‌ క్యూబ్‌ టాస్క్ లో ఆమె పట్టుదల ను ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే. ప్రతి టాస్క్ లో కూడా గేవప్ ఇవ్వకుండా ది బెస్ట్‌ అనిపించుకుని విజేత అయ్యేంత స్టామిన కలిగిన అమ్మాయి సిరి అనడంలో సందేహం లేదు.

కాని ఆమె తాను విజేత అయినా కాకున్న పర్వాలేదు షన్నూ విజేత అవ్వాలని కోరుకుంది. అక్కడే ఆమెకు పెద్ద మైనస్ అయ్యింది. పది పదకొండవ వారంలో షన్నూ బయటకు వెళ్లి పోయి ఉంటే ఖచ్చితంగా సన్నీకి ఏమాత్రం తగ్గకుండా సిరి పోటీగా నిలిచేది అనడంలో సందేహం లేదు. సిరి ఫిజికల్ గా మెంటల్ గా ప్రతి ఒక్క విధంగా కూడా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకుంది.

షన్నూతో వ్యవహారం.. అతడితో రిలేషన్ ను నెక్ట్స్‌ లెవల్‌ కు తీసుకు వెళ్లడం.. పదే పదే అతడితో మాటలు పడటం.. అలగడం.. అతడికి సారీ చెప్పడం ఇలా ఆమె తనను తాను వీక్‌ చేసుకుంది. అతడితో ఎన్ని ఉన్నా కూడా టాస్క్ ల సమయంలో ది బెస్ట్‌ ఇస్తూ వచ్చింది. అలా బిగ్‌ బాస్ లో లేడీ ఫైటర్ గా పేరు దక్కించుకుంది.

పటాకా అంటూ అందరితో పిలిపించుకున్న సిరి టాప్‌ 5 వరకు రావడం గొప్ప విషయమే. షన్నూ తో ఆమె అర్థం లేని రిలేషన్‌ కారణంగా విన్నర్‌ అయ్యే అవకాశంను మిస్ చేసుకుంది అని అభిమానులు అంటున్నారు. అదే షన్ను వల్ల అన్ని వారాలు ఆమె హౌస్ లో కొనసాగింది అని కూడా కొందరు అంటూ ఉన్నారు. మొత్తానికి బిగ్‌ బాస్ లో ఈ సారి వన్‌ అండ్ ఓన్లీ లేడీ టాప్‌ 5 గా సిరి నిలిచింది.

టాప్‌ 5 అంటే 15 వారాల పాటు హౌస్ లో కొనసాగిన సిరికి దక్కిన పారితోషికం ఎంత అయ్యి ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ. ఆమెకు యూట్యూబ్‌ ద్వారా.. బుల్లి తెర ద్వారా మంచి గుర్తింపు దక్కింది. బిగ్‌ బాస్ కు ముందు నుండే ఆమె జనాల్లో పాపులర్ ఫిగర్ కనుక వారంకు 1.75 లక్షల రూపాయల పారితోషికం తో ఆమె హౌస్ లోకి వెళ్లింది.

టాప్ 5 వరకు వచ్చింది కనుక ఆమెకు బిగ్‌ బాస్ నుండి పాతిక లక్షల వరకు పారితోషికం అంది ఉంటుంది అనేది టాక్. పాతిక లక్షల పారితోషికంతో పాటు ఇతరం మరో అయిదు ఆరు లక్షల వరకు ఉంటాయని అంటున్నారు. అంటే మొత్తంగా సిరికి బిగ్‌ బాస్ తో 15 వారాలకు గాను దాదాపుగా 30 లక్షల వరకు దక్కింది. ఇది ఖచ్చితంగా ఆమెకు పెద్ద మొత్తమే అనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News