'ఆర్ ఆర్ ఆర్ -2' క‌థ ఎలా ఉండాలంటే?

Update: 2022-12-14 11:30 GMT
ఆస్కార్  నామినేష‌న్ కి  ముందు  'ఆర్ ఆర్ ఆర్' అమెరికాలో అవార్డులు..రివార్డుల‌తో మోతెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 1200కోట్లు కాదు..అంత‌కు మించిన ఘ‌న‌త సాధిస్తుంద‌ని భార‌తీయులంతా ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ అవార్డుని ముద్దాడి  రాజ‌మౌళి ఇండియాకి గ‌ర్వంగా తిరిగొస్తాడ‌ని అభిమానులు స‌హా ప్ర‌జలంతా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

తెలుగు సినిమా ఖ్యాతిని అవార్డుతో విశ్వ‌వ్యాప్తం చేస్తాడ‌ని ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. జ‌క్క‌న్న‌పై ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా?  వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా మోక్కవోని  దీక్ష‌తో అవార్డు సాధించే దిశ‌గా జ‌క్క‌న్న‌ప్ర‌తి ప్ర‌య‌త్నానాన్నిప్ర‌శంసించ ద‌గ్గ‌దే. మ‌రి ఇలాంటి త‌రుణంలో ఆర్ ఆర్ ఆర్ -2  కూడా ఉంటుంద‌ని ఇప్ప‌టికే మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

దీనిపై ఇప్ప‌టికే రాజమౌళి క్లారిటీ కూడా ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ -2 క‌చ్చితంగా ఉంటుంద‌ని..కానీ అది ఎప్పుడు చేస్తానో త‌న‌కే తెలియ‌ద‌ని అన్నారు. అయినా స‌రే మీడియాలో క‌థ‌నాల‌కు మాత్రం బ్రేక్ ప‌డ‌లేదు. ఇప్ప‌టికే  రాజ‌మౌళి బృందం ఆర్ ఆర్ ఆర్ -2 క‌థ‌కి సంబంధించి కొన్ని లైన్లు సైతం వినిపించార‌ని తాజా స‌మాచారం. అయితే అవేవి రాజ‌మౌళి ఎగ్జైట్ అయ్యేంత‌గా లేవ‌ని తెలుస్తోంది.

ఏ క‌థ తీసుకున్నా అందులో ఎగ్జైట్ మెట్ ఉండాలి. క‌థ బ‌లంగా లేక‌పోయినా కొన్ని అంశాలు క‌చ్చితంగా కీల‌కంగా ఉండాల‌న్న‌ది రాజ‌మౌళి ఐడియాగా తెలుస్తోంది. అలాగైతే రాజ‌మౌళికి శిష్యులు ఇచ్చే స‌ల‌హాల‌తో సంతృప్తిం చెంద‌లేరు.  అందుకు రైట‌ర్ బాహుబ‌లి విజ‌యేంద్ర ప్ర‌సాద్ రంగంలోకి దిగాల్సిందే. త‌న‌యుడిని తండ్రిని మాత్రంమే త‌న క‌థ‌తో....ర‌చ‌న‌తో మెప్పించ‌గ‌ల‌డు.

అయినా ఇంత వ‌ర‌కూ రాజ‌మౌళి బ‌య‌ట ర‌చ‌యిత‌ల క‌థ‌ల‌తో సినిమాలు చేసింది లేదు. ఇంట్లోనే ర‌చనా దిగ్గ‌జం ఉండ‌టంతో ఆయ‌న బ‌య‌ట‌కు ఎందుకెళ్తాడు? ఆ లెక్క‌న చూస్తే ఆర్ ఆర్ ఆర్ -2 బాద్య‌త‌లు పెద్దాయ‌న‌పైనే ఎక్కుడ‌గా  ఉన్నాయ‌ని  తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హేష్ కోసం ఓ భారీ యాక్ష‌న్ అడ్వెంచెర్ స్ర్కిప్ట్ ని సిద్దం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. అది పూర్త‌యితే త‌ప్ప‌! మ‌రో క‌థ‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం లేదు. అంత‌వ‌ర‌కూ ఆర్ ఆర్ ఆర్-2 చ‌ర్చ కూడా అన‌వ‌స‌రమైన విష‌య‌మే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News