డిప్రెషన్ గురించి సూపర్ స్టార్‌ షాకింగ్ కామెంట్స్‌

Update: 2023-01-05 17:30 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ వివాహ బంధం మరియు ఇతర విషయాల వల్ల డిప్రెషన్‌ తో బాధ పడుతున్నట్లుగా పేర్కొన్నాడు. స్వయంగా ఆయనే తన డిప్రెషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా మానసిక సంఘర్షణల సమయంలో నేను చనిపోతానేమో అనుకున్నాను అంటూ హృతిక్‌ రోషన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ సమయంలో నేను నా తదుపరి సినిమాలకు సిద్దంగా లేను.. అంతే కాకుండా చాలా పెద్ద సవాళ్లను నేను ఎదుర్కొన్న సమయంలో వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాను. నన్ను నేను అర్థం చేసుకుంటూ ముందుకు సాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. నా యొక్క డిప్రెషన్ కారణంగా మూడు నాలుగు నెలల పాటు ఫిజిక్ విషయంలో దృష్టి పెట్టలేక పోయాను.

నేను డిప్రెషన్‌ అంచున ఉన్నాను.. నా మానసిక పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు నేను నా జీవితాన్ని పూర్తిగా కోల్పోయాను అనే భావన కలిగింది అంటూ తన 'వార్‌' సినిమాకు ముందు ఉన్న పరిస్థితులను వెళ్లడించాడు. ప్రస్తుతం హృతిక్‌ చాలా ఉత్సాహంగా జోష్‌ తో కనిపిస్తున్నాడు.

గత ఏడాది విక్రమ్‌ వేదా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం ఫైటర్‌ సినిమా లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో హృతిక్‌ ఫైటర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది హృతిక్‌ రోషన్ నుండి సినిమాలు ఏమీ రావడం లేదు. హృతిక్‌ నుండి అభిమానులు ఎలాంటి సినిమాను ఆశిస్తున్నారో ఫైటర్‌ అలాగే ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.   




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News