వివాహ బంధంతో ముడిపడ్డాక.. దాన్ని తెంచుకోవడం అంత సులువు కాదు. ఒకరితో ఒకరికి అసలేమాత్రం పడని స్థితిలోనే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు. మరి అలా విడిపోయిన వాళ్లు మాట వరసకు కూడా మళ్లీ కలవడానికి ఇష్టపడరు. కానీ అలాంటి స్థితిలో కూడా వాళ్లను కలిపే వారధి కటుంటుంది. అదే.. సంతానం. విడాకులు తీసుకుని వేరుపడ్డ జంటల్లో కొందరు పిల్లల కోసమైనా కలుస్తారు. ఐతే చాలామంది సెలబ్రెటీలను వారి పిల్లలు కూడా కలపలేరు. అలాంటి వాళ్లకు పాఠాలు చెబుతున్నారు హృతిక్ రోషన్.. సుసానె ఖాన్.
ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్-సుసానె రెండేళ్ల కిందట తీవ్ర విభేదాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల భరణం కింద హృతిక్ నుంచి ఏకంగా రూ.400 కోట్లు సుసానె వసూలు చేసినట్లుగా వార్తలొచ్చాయి అప్పట్లో. ఐతే అందులో వాస్తవమెంతో కానీ.. విడాకుల తర్వాత కూడా వీళ్లిద్దరూ తమ ఇద్దరు పిల్లల కోసం తరచుగా కలుస్తున్నారు. వారి కోసం పార్టీలకు వస్తున్నారు. డిన్నర్లు చేస్తున్నారు. వెకేషన్ కు కూడా వెళ్తున్నారు. ఇలా విడాకుల తర్వాత కూడా పిల్లల కోసం హాలిడేకు వెళ్లే జంట హృతిక్-సుసానె మాత్రమేనేమో. ఈ విషయంలో సెలబ్రెటీ కపుల్స్ అందరూ వీళ్లిద్దరినీ చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. పిల్లల కోసం అప్పుడప్పుడు ఆ మాత్రం త్యాగం చేయడంలో.. సమయం వెచ్చించడానికి కూడా మనసు రాకుంటే ఎలా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/