భార్యభర్తగా విడిపోయి - తల్లిదండ్రులుగా గెలుస్తున్నారు!

Update: 2019-07-22 01:30 GMT
ఇది వరకూ కూడా పలుసార్లు తమ పిల్లల కోసం జంటగా కనిపించారు హృతిక్  రోషన్ - సుసానే.  కొన్నాళ్ల కిందట వీరు అధికారికంగా విడిపోయారు. విడాకులు తీసుకుని  చట్టబద్ధంగా వేరయ్యారు. పరిహారం అంశాన్ని కూడా సెటిల్ చేసుకున్నారు.

సాధారణంగా అంత రచ్చ జరిగిన తర్వాత,  విడిపోయిన తర్వాత ఏ భార్యా భర్త అయినా ఒకరి  మొహాలు చూడటానికి మరొకరికి మనసొప్పకపోవచ్చు.  ఊరికే విడిపోవడమే కాదు, వీరు చట్టబద్ధంగా విడాకులు కూడా తీసుకున్నారు. అయితే భార్యభర్తలుగా విడిపోయినా  తల్లిదండ్రులుగా మాత్రం  కొనసాగుతూ ఉన్నారు వీళ్లు.

తమ పిల్లల కోసం తరచూ వీరిద్దరూ కలిసి కనిపిస్తూ ఉంటారు. వారిని విహారయాత్రలకు తిప్పే సమయంలో, వారిని ఎంటర్ టైన్ చేయడం లో సిసలైన తల్లిదండ్రుల్లా వ్యవహరిస్తున్నారు  వీరిద్దరూ. తాజాగా వీకెండ్ లో తమ తనయులు ఇద్దరినీ తీసుకుని ముంబైలోని ఒక మల్టీప్లెక్స్ కు వెళ్లారు వీళ్లిద్దరూ. అక్కడ  పిల్లలతో కలిసి సినిమా చూసి - సరదాగా గడిపారు.

వీరి తీరును చూస్తుంటే.. వీళ్లు విబేధాలతో విడాకులు తీసుకున్నారంటే ఎవ్వరూ నమ్మరు. తమ పిల్లల కోసం అంత క్లోజ్ గా కనిపిస్తున్నారు ఈ మాజీ భార్య భర్త! వ్యక్తిగత విబేధాలతో విడిపోయినా - పిల్లల కోసం వీరు కలిసే తీరు మాత్రం అభినందనీయమే. విడాకుల తర్వాత కూడా వీరిద్దరూ వేరే పెళ్లిళ్లు చేసుకునే ఆలోచనతో కనిపించకపోవడం కూడా గమనార్హం.


Tags:    

Similar News