ఈమెయిల్ నాది కాదంటున్న హీరో

Update: 2016-03-18 05:15 GMT
హ్రితిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య వ్యవహారం రచ్చకెక్కేసింది. లీగల్ నోటీసులు ఇచ్చుకుని తమ మధ్య విబేధాలను బాహాటంగానే ఒప్పేసుకున్నారు. వాటిలో ఉన్న మేటర్ ను బయటకు చదివి వినిపించి.. ఈ వివాదాన్ని మరింత రాజేసింది కంగనా. ఆమెపై నిఘా హ్రితిక్ నిఘా పెట్టడంటూ ఈ గొడవను మరింత తీవ్రం చేశాడు కంగనా ఫ్రెండ్. ఈ వివాదం ముదురుతుండడంతో.. ఎట్టకేలకు హ్రితిక్ రోషన్ ఇప్పుడో స్టేట్ మెంట్ ఇచ్చి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అంతే కాదు.. కంగనను మరోసారి బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు ఈ హీరో.

'hroshan@email.com.. ఈ మెయిల్ నాది కాదంటూ నేను 12 డిసెంబర్ 2014న పోలీస్ సైబర్ సెల్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. తను ఆ మెయిల్ గల వ్యక్తితోనే కమ్యూనికేట్ చేసింది, నాకు ఈ ఈమెయిల్ ఐడీతో ఎటువంటి సంబంధం' లేదని ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు హ్రితిక్. ఓ ప్రైవేటు విషయం పబ్లిక్ అయితే, అందరికీ ఇంట్రెస్ట్ పెరుగుతుందని, అయితే అందరికీ నిజం తెలియాలనే ఈ స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని అన్నాడు ఈ బాలీవుడ్ స్టార్.

ఈ వ్యవహారం పబ్లిక్ కాకూడదనే తను లీగల్ నోటీస్ ఇస్తే.. దీన్ని పబ్లిక్ పెట్టేసిన ఆమె.. కనీసం నైతికత కూడా పాటించలేదని అంటున్నారు హ్రితిక్. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా అటాక్ చేయాలని అనుకోలేదని, రెండేళ్లుగా సైలెంట్ గానే ఉన్నానని చెప్పుకొచ్చాడు. చివరగా.. ఈ అంశంపై తాను ఇచ్చే చిట్టచివరి స్టేట్మెంట్ ఇదే అని తేల్చేశాడు హ్రితిక్ రోషన్.
Tags:    

Similar News