ఆ సినిమా సీక్వెల్ తీస్తార‌ట‌

Update: 2018-03-09 17:30 GMT
జింద‌గీ న మిలేగీ దొబారా... సూప‌ర్ హిట్ సినిమా. ఇప్ప‌టికీ అది ఎంతోమంది ఆల్‌ టైమ్ ఫేవ‌రేట్‌. జీవితంలోని ప్ర‌తి క్ష‌ణాన్ని ఆనందంగా గ‌డ‌పాల‌ని చెప్పే సినిమా. నిజ‌మే క‌దా... జీవితం మ‌ళ్లీమ‌ళ్లీ రాదు. ఆ అంద‌మైన సినిమా సీక్వెల్ కోసం ఆ సినిమాలో న‌టించిన హీరోలే కాదు... వారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తీయాల‌ని చిత్ర‌యూనిట్ నిర్ణ‌యించింద‌ట‌.

జావేద్ అక్త‌ర్ కూతురు జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. హృతిక్ రోష‌ణ్... ఫ‌ర్హాన్ అక్త‌ర్‌... అభ‌య్ డియోల్ హీరోలుగా... క‌త్రినా కైఫ్‌... క‌ల్కి కొచ్లిన్ హీరోయిన్లుగా చేసిన సినిమా. బ్యాచిల‌ర్లుగా ఎంజాయ్ చేయ‌డానికి స్పెయిన్ వెళ్లిన ముగ్గురు స్నేహితుల జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను చాలా హృద్యంగా తెర‌కెక్కించింది జోయా. అప్ప‌ట్లో ఆ హీరోలు ఈ సినిమాకు సీక్వెల్ కావాల్సిందేన‌ని అన్నారు. వారి కోరిక ఇప్పుడు తీర‌బోతోంది. జోయా సీక్వెల్ తీసేందుకు సిద్ధ‌మవుతోంది. క‌థ ఇప్ప‌టికే సిద్ద‌మైన‌ట్టు స‌మాచారం. ఇక స్క్రిప్టు వ‌ర్కే మిగిలిందట‌. అది కూడా పూర్త‌యితే... సినిమా సెట్స్ మీద‌కి వెళ్ల‌డ‌మే త‌రువాయి.

ఇక న‌టీన‌టులు... కూడా పాత‌వారే ఉండే అవ‌కాశం ఎక్కువ‌. ఎందుకంటే ఆ పాత్ర‌లకు ఆ న‌టులే అన్నంతగా ప్రేక్ష‌కులు కనెక్ట్ అయిపోయారు. కాబ‌ట్టి కాస్ట్ ని మార్చే ధైర్యం జోయా చేయ‌క‌పోవచ్చు. అంతేకాదు ఆ న‌టీన‌టులంతా కూడా ఆ సినిమాను వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా ఉండ‌రు. వారిరి బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమా కాబ‌ట్టి... జోయా అడిగిన వెంట‌నే ఓకే చేసేసే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది చివ‌రికి ఈ సినిమా సెట్స్ మీద‌కి వెళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది.
Tags:    

Similar News